హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme 6: రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... మార్చి 5న రిలీజ్

Realme 6: రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... మార్చి 5న రిలీజ్

Realme 6: రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... మార్చి 5న రిలీజ్

Realme 6: రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... మార్చి 5న రిలీజ్

Realme 6 Series Smartphones | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15,000 లోపేనా? అయితే మార్చి 5 వరకు ఆగండి. అదే రోజున రియల్‌మీ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయి.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. రియల్‌మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి. మార్చి 5న రియల్‌మీ 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం రియల్‌మీ 5 సిరీస్‌లో రియల్‌మీ 5, రియల్‌మీ 5ఎస్, రియల్‌మీ 5 ప్రో మోడల్స్ మార్కెట్‌లో ఉన్నాయి. వీటి అప్‌గ్రేడ్ వర్షన్‌తో రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో మోడల్స్ వచ్చే నెలలో మార్కెట్లోకి రాబోతున్నాయి. రియల్‌మీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ప్రచారం చేస్తున్నారు.

  మార్చి 5న మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మీ 6, రియల్‌మీ 6 ప్రో ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు పరిచయం కానున్నాయి. రియల్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌తో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కెమెరాకు పోజులిచ్చారు. రియల్‌మీ 6 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లలో హోల్-పంచ్ డిస్‌ప్లే కనిపించడం విశేషం. డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఉండటం మరో ప్రత్యేకత. రియల్‌మీ 6 సిరీస్ ఫోన్లన్నింటికీ డ్యూయెల్ ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశముంది. అంతేకాదు... 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని రియల్‌మీ వెల్లడించింది.

  రియల్‌మీ 6 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ హీలియో జీ90టీ ప్రాసెసర్, 4,300 బ్యాటరీ ఉంటుందన్న వార్తలొస్తున్నాయి. రియల్‌మీ 6 ప్రో మోడల్‌లో క్వాడ్ కెమెరా సెటర్, 20x జూమ్, 90Hz రిఫ్రెష్ రేట్ లాంటి ప్రత్యేకతలు ఉండే అవకాశముంది. మరి ఈ రెండు ఫోన్లల్లో ఎలాంటి అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయో తెలియాలంటే మార్చి 5 వరకు ఆగాల్సిందే.

  ఇవి కూడా చదవండి:

  Samsung Galaxy M31: భారీ బ్యాటరీతో సాంసంగ్ గెలాక్సీ ఎం31... ఎలా ఉందో చూడండి

  Realme PaySa: మంచి ఐడియా చెప్తే రూ.10,00,000 మీవే

  Realme X50 Pro 5G: తొలి 5జీ స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ ఎక్స్50 ప్రో 5జీ' ఎలా ఉందో చూడండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Realme, Realme UI, Salman khan, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు