హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 50i Prime: రూ.10 వేల లోపు రియల్‌మీ మొబైల్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme Narzo 50i Prime: రూ.10 వేల లోపు రియల్‌మీ మొబైల్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

Realme Narzo 50i Prime: రూ.10 వేల లోపు రియల్‌మీ మొబైల్ రిలీజ్... ఫీచర్స్ ఇవే
(image: Realme India)

Realme Narzo 50i Prime: రూ.10 వేల లోపు రియల్‌మీ మొబైల్ రిలీజ్... ఫీచర్స్ ఇవే (image: Realme India)

Realme Narzo 50i Prime | రూ.10 వేల లోపు బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. రియల్‌మీ నుంచి రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ (Realme Narzo 50i Prime) రిలీజైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రియల్‌మీ ఇండియా భారతదేశంలో రూ.10,000 లోపు సెగ్మెంట్‌లో (Smartphone Under Rs 10,000) కొత్త మొబైల్‌ను రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ (Realme Narzo 50i Prime) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో Unisoc T612 ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ, 8మెగాపిక్సెల్ ఏఐ కెమెరా లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,999 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. ఇతర కస్టమర్లకు సెప్టెంబర్ 23 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, రిలయన్స్, ఇతర స్టోర్లలో కొనొచ్చు. డార్క్ బ్లూ, మింట్ గ్రీన్ కలర్స్‌లో లభిస్తుంది.

రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్పెసిఫికేషన్స్

రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ మొబైల్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజైంది. డ్యూయెల్ సిమ్ + మైక్రోఎస్‌డీ కార్డ్ స్లాట్ సపోర్ట్ ఉంది. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. ఇందులో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. Unisoc T612 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ సీ33, రియల్‌మీ సీ30, రియల్‌మీ సీ31 మొబైల్స్‌లో ఉంది.

Motorola Edge 30 Ultra: ప్రపంచంలోనే మొదటి 200MP కెమెరా స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?

రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్ కెమెరా ఫీచర్స్ చూస్తే 8మెగాపిక్సెల్ ఏఐ కెమెరా ఉంది. రియర్ కెమెరాలో బ్యూటీ, ఫిల్టర్, హెచ్‌డీఆర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్‌రైట్, టైమ్‌ల్యాప్స్, ఎక్స్‌పర్ట్, సూపర్ నైట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఏఐ బ్యూటీ, హెచ్‌డీఆర్, ఫిల్టర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Poco M5: కాసేపట్లో పోకో ఎం5 సేల్... సరికొత్త ప్రాసెసర్, 6GB ర్యామ్, 50MP కెమెరా... ఆఫర్ ధర రూ.10,999

రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. 3.5ఎంఎం జాక్, బ్లూటూత్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

ఇటీవల రూ.10,000 లోపు రియల్‌మీ సీ33 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజైంది. ప్రారంభ ధర రూ.8,999 మాత్రమే. ఇందులో 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, Unisoc T612 ప్రాసెసర్, 50మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 5000mAh బ్యాటరీ, 10వాట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Flipkart, Realme, Smartphone

ఉత్తమ కథలు