హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 50A Prime: రియల్‌మీ నుంచి తక్కువ ధరకే మరో స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ఫీచర్స్ ఇవే

Realme Narzo 50A Prime: రియల్‌మీ నుంచి తక్కువ ధరకే మరో స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ఫీచర్స్ ఇవే

Realme Narzo 50A Prime: రియల్‌మీ నుంచి తక్కువ ధరకే మరో స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ఫీచర్స్ ఇవే
(image: Realme India)

Realme Narzo 50A Prime: రియల్‌మీ నుంచి తక్కువ ధరకే మరో స్మార్ట్‌ఫోన్... రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ఫీచర్స్ ఇవే (image: Realme India)

Realme Narzo 50A Prime | రియల్‌మీ నుంచి రూ.12,000 లోపు బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ (Realme Narzo 50A Prime) మొబైల్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో యూనిసోక్ 612 ప్రాసెసర్ ప్రాసెసర్ ఉంది.

ఇంకా చదవండి ...

తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ (Realme Narzo 50A Prime) మోడల్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది రియల్‌మీ ఇండియా. ఇందులో 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, యూనిసోక్ 612 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రూ.12,000 లోపు బడ్జెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజైంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెడ్‌మీ 10, సాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 (Samsung Galaxy F22) లాంటి మోడల్స్‌కు రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ మొబైల్ గట్టి పోటీ ఇవ్వనుంది.

రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ ధర


రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. ఫ్లాష్ బ్లాక్, ఫ్లాష్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఏప్రిల్ 28న సేల్ ప్రారంభం అవుతుంది. అమెజాన్‌తో పాటు రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు.

Moto G52: బడ్జెట్ ధరలో మోటో జీ52 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ఫీచర్స్ ఇవే

రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్పెసిఫికేషన్స్


రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ టీ612 ప్రాసెసర్ ఉంది. ఇదే ప్రాసెసర్ రియల్‌మీ సీ31 స్మార్ట్‌ఫోన్‌లో ఉంది. కొద్ది రోజుల క్రితం యూనిసోక్ టీ616 ప్రాసెసర్‌తో రియల్‌మీ సీ35 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆర్ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

Flipkart Offer: ఈ పాపులర్ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది... ఆఫర్ కొద్ది రోజులే

రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + మోనోక్రోమ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. రియర్ కెమెరాలో 50MP మోడ్, బర్స్ట్, ఫిల్టర్, టైమ్ లాప్స్, ప్రో, పనోరమా, మాక్రో, నైట్ ప్రో, పోర్ట్రెయిట్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 8మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫిల్టర్, టైమ్ ల్యాప్స్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజైంది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 7జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18వాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ వర్షన్ 5, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.

First published:

Tags: Mobile News, Mobiles, Realme, Realme Narzo, Smartphone

ఉత్తమ కథలు