Realme Narzo 50 Series: రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర ఎంతంటే

Realme Narzo 50 Series: రియల్‌మీ నార్జో 50ఏ, నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర ఎంతంటే

Realme Narzo 50 Series | రియల్‌మీ నార్జో 50ఏ (Realme Narzo 50A), రియల్‌మీ నార్జో 50ఐ (Realme Narzo 50i) స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ నార్జో 50 సిరీస్ (Realme Narzo 50 Series) స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 50ఏ (Realme Narzo 50A), రియల్‌మీ నార్జో 50ఐ (Realme Narzo 50i) మోడల్స్‌ని పరిచయం చేసింది. వీటితో పాటు రియల్‌మీ బ్యాండ్ 2 ఫిట్‌నెస్ ట్రాకర్, రియల్‌మీ నియో 32 అంగుళాల స్మార్ట్ టీవీని పరిచయం చేసింది. స్మార్ట్‌ఫోన్ల విషయానికి వస్తే రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,000 బడ్జెట్‌లో, రియల్‌మీ నార్జో 50ఐ మోడల్‌ను రూ.7,499 బడ్జెట్‌లో రిలీజ్ చేసింది కంపెనీ. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల సేల్ అక్టోబర్ 7న ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కనొచ్చు. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్లతో పాటు ఆఫ్‌లైన్ రీటైలర్స్ దగ్గరా కొనొచ్చు.

    ధర ఎంత


    రియల్‌మీ నార్జో 50ఏ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,499 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499. ఇక రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,499.

    Oppo Smartphone Offers: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ 10 ఒప్పో స్మార్ట్‌ఫోన్లపై రూ.4,000 వరకు డిస్కౌంట్


    రియల్‌మీ నార్జో 50ఏ స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌లో 6,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.

    Redmi 9 Activ: రూ.10,000 లోపు మరో స్మార్ట్‌ఫోన్ లాంఛ్ చేసిన రెడ్‌మీ... సేల్ మొదలైంది

    రియల్‌మీ నార్జో 50ఏ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్‌తో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. కెమెరాలో సూపర్ నైట్‌స్కేప్, నైట్ ఫిల్టర్స్, బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్, పనోరమిక్ వ్యూ, పోర్ట్‌రైట్ మోడ్, టైమ్ ల్యాప్స్, స్లోమోషన్, ఎక్స్‌పర్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఆక్సిజన్ బ్లూ, ఆక్సిజన్ గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.


    రియల్‌మీ నార్జో 50ఐ స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ నార్జో 50ఐ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.5 అంగుళాల డిస్‌ప్లే ఉంది. యూనిసోక్ 9863 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 2జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రోఎస్‌డీ కార్డుతో స్టోరేజ్ 256జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 8మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మింట్ గ్రీన్, కార్బన్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. రియల్‌మీ నార్జో 50ఐ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఆండ్రాయిడ్ 11 బేస్డ్ రియల్‌మీ యూఐ గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: