Upcoming Smartphones: దసరా లోపు 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయి... ఏవంటే

Upcoming Smartphones: దసరా లోపు 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ వస్తున్నాయి... ఏవంటే

Upcoming Smartphones | మీరు కొత్త మొబైల్ కొనాలనుకుంటున్నారా? దసరా లోపు 10 పైగా కొత్త స్మార్ట్‌ఫోన్స్ (Upcoming Smartphones) ఇండియన్ మార్కెట్లోకి రాబోతున్నాయి. ఏఏ కంపెనీలు ఈ మొబైల్స్ లాంఛ్ చేస్తున్నాయో, మోడల్స్ ఏవో తెలుసుకోండి.

  • Share this:
రాబోయే దసరా, దీపావళి పండుగ సీజన్​లో ఆఫర్ల వరద కురిపించేందుకు ఇ-కామర్స్​ దిగ్గజాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అమెజాన్ గ్రేట్​ ఇండియన్​ ఫెస్టివల్​ (Amazon Great Indian Festival) సేల్​ను ప్రకటించగా, తాజాగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ (Flipkart Big Billion Days) సేల్​ను ప్రకటించింది. అక్టోబర్ 7 నుంచి 12 వరకు ఆరు రోజుల పాటు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ జరగుంది. అమెజాన్ సేల్ తేదీలు ఇంకా ప్రకటించలేదు. ఈ సేల్‌ను దృష్టిలో పెట్టుకొని స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త మోడల్స్ పరిచయం చేయబోతున్నాయి. దసరా లోపు 6 కొత్త స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయి. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వెబ్‌సైట్స్, యాప్స్‌లో రాబోయే స్మార్ట్‌ఫోన్లకు సంబంధించిన టీజర్స్ కనిపిస్తున్నాయి. మరి ఏఏ స్మార్ట్‌ఫోన్స్ రాబోతున్నాయో తెలుసుకోండి.





















































రిలీజ్ డేట్ స్మార్ట్‌ఫోన్ మోడల్ ఎక్కడ కొనొచ్చు 
సెప్టెంబర్ 24 రియల్‌మీ నార్జో 50ఏ, రియల్‌మీ నార్జో 50, రియల్‌మీ నార్జో 50 ప్రో ఫ్లిప్ కార్ట్
సెప్టెంబర్ 27 ఒప్పో ఏ55  ఫ్లిప్‌కార్ట్‌
సెప్టెంబర్ 28 సాంసంగ్ గెలాక్సీ ఎం52 5జీ  అమెజాన్‌
సెప్టెంబర్ 29 సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ ఫ్లిప్‌కార్ట్‌
సెప్టెంబర్ 29 షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ అమెజాన్‌
సెప్టెంబర్ 30 పోకో సీ4  ఫ్లిప్‌కార్ట్‌
సెప్టెంబర్ 30 వివో ఎక్స్70 సిరీస్  ఫ్లిప్‌కార్ట్‌
అక్టోబర్ 1 మోటోరోలా ఎడ్జ్ 20 ప్రో  ఫ్లిప్‌కార్ట్‌
అక్టోబర్ మొదటి వారం రియల్‌మీ జీటీ నియో2 

Flipkart Big Billion Days: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.12,000 తగ్గింపు

మోటరోలా, ఒప్పో, పోకో, రియల్‌మీ, శామ్‌సంగ్, వివో వంటి స్మార్ట్​ఫోన్​ బ్రాండ్లు ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొత్త ఫోన్లను విక్రయించనున్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2021 పేజీలోని "రివీల్ క్యాలెండర్" సెక్షన్​ కింద ఈ కొత్త ఫోన్ల ధర, ఫీచర్లను కస్టమర్లు చూడవచ్చని తెలిపింది. ప్రముఖ స్మార్ట్​బ్రాండ్​ రియల్‌మీ కొత్త ప్రోడక్ట్స్​ ఫ్లిప్​కార్ట్​ ద్వారా అమ్మకానికి రానున్నాయి. సెప్టెంబర్ 24 న విడుదల కానున్న రియల్​మీ నార్జో 50 సిరీస్​లోని నార్జో 50, నార్జో 50 ప్రో మోడళ్లతో పాటు రియల్‌మీ బ్యాండ్ 2, 32-అంగుళాల స్మార్ట్ టీవీ నియోలు ఈ సేల్​లో అమ్మకానికి రానున్నాయి.

Poco X3 Pro: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు

రాబోయే కొత్త స్మార్ట్‌ఫోన్స్ వివరాలు


మరోవైపు, స్మార్ట్​ దిగ్గజం శామ్‌సంగ్ సెప్టెంబర్ 28 మధ్యాహ్నం 12 గంటలకు గెలాక్సీ M52 5G ని లాంచ్ చేయబోతోంది. ఫ్లిప్‌కార్ట్ అదే రోజు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను టీజ్ చేయనుంది. ఈ మేరకు శామ్​సంగ్​ ట్వీట్​ ద్వారా ధృవీకరించింది. అయితే, గెలాక్సీ M52 5G అమ్మకాలు అమెజాన్ ద్వారా కూడా జరగనున్నట్లు సమాచారం. ఇక, ఒప్పో సంస్థ ఈ నెల 27న ఒప్పో ఎ 55 ని లాంచ్ చేయనుంది. మరోవైపు, పోకో, వివో సెప్టెంబర్ 30న, మోటరోలా అక్టోబర్ 1న కొత్త ఫోన్లను లాంచ్​ చేయనున్నాయి. ఇవన్నీ ఫ్లిప్​కార్ట్​ బిగ్​బిలియన్​ డేస్​ సేల్​ ద్వారా తొలిసారి అమ్మకానికి రానున్నాయి. అయితే, మోటరోలా, పోకో ఏ ఏ మోడళ్లను లాంచ్ చేస్తాయనే విషయంపై స్పష్టత లేదు.
Published by:Santhosh Kumar S
First published: