రియల్‌మీ ఇండియా భారతదేశంలో మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో (Realme Narzo 50 Series) రియల్‌మీ నార్జో 50 5జీ (Realme Narzo 50 5G), రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ (Realme Narzo 50 Pro 5G) మోడల్స్‌ని పరిచయం చేసింది. ఇప్పటికే ఈ సిరీస్‌లో ఇండియాలో రియల్‌మీ నార్జో 50ఏ, రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్, రియల్‌మీ నార్జో 50ఐ, రియల్‌మీ నార్జో 50 4జీ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు మొబైల్స్ రిలీజ్ చేసింది. దీంతో రియల్‌మీ నార్జో 50 సిరీస్‌లో ఆరు స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ మొబైల్ రూ.20,000 బడ్జెట్‌లో, రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.15,000 బడ్జెట్‌లో రిలీజైంది.
రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ స్పెసిఫికేషన్స్
రియల్‌మీ నార్జో 50 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.21,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. మే 26 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.19,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.21,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. హైపర్ బ్లాక్, హైపర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్, రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు.
iQoo Gen Z Sale: ఐకూ జెన్ జెడ్ సేల్... ఐకూ స్మార్ట్‌ఫోన్లపై రూ.8,000 వరకు డిస్కౌంట్
Introducing #realmenarzo50Pro 5G with:
👉Dimensity 920 5G Processor
👉90Hz Super AMOLED Display
& much more.
First Sale offer price:
👉6GB+128GB, ₹19,999
👉8GB+128GB, ₹21,999
రియల్‌మీ నార్జో 50 ప్రో డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 920 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 48మెగాపిక్సెల్ Samsung S5KGM1ST ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ నార్జో 50 5జీ స్పెసిఫికేషన్స్
రియల్‌మీ నార్జో 50 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,999 కాగా, 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.17,999. మే 24 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం అవుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో 4జీబీ+64జీబీ వేరియంట్‌ను రూ.13,999 ధరకు, 4జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.14,999 ధరకు, 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.15,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. హైపర్ బ్లాక్, హైపర్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. అమెజాన్, రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు.
రియల్‌మీ నార్జో 50 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 48మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + మోనో క్రోమ్ పోర్ట్‌రైట్ సెన్సార్లతో డ్యూయెల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా 33 వాట్ డాట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.