రియల్మీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రియల్మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. రియల్మీ నార్జో 30 సిరీస్‌లో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఇప్పటికే ఈ సిరీస్‌లో రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్స్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రియల్మీ నార్జో 30 మోడల్‌ను మలేషియాలో రిలీజ్ చేసింది రియల్మీ. ఇందులో మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో సూపర్ నైట్ స్కేప్, అల్ట్రా 48 మెగాపిక్సెల్ మోడ్, పనోరమా, పోర్ట్రైట్ మోడ్, టైమ్ ల్యాప్స్ ఫోటోగ్రఫీ, హెచ్డీఐర్, అల్ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెల్ఫీ కెమెరా ఉండటం విశేషం. ఇండియన్ కరెన్సీతో పోలిస్తే రియల్మీ నార్జో 30 ప్రారంభ ధర రూ.14,100. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న క్లారిటీ లేదు.
ఇండియాలో ఇప్పటికే రియల్మీ నార్జో 30ఏ, రియల్మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అయ్యాయి. రియల్మీ ఫ్యాన్స్ రియల్మీ నార్జో 30 మోడల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ మలేషియాలో రిలీజ్ అయింది కాబట్టి త్వరలో ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.