హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఇదిగో సాక్ష్యం

Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఇదిగో సాక్ష్యం

Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఇదిగో సాక్ష్యం
(image: Realme)

Realme Narzo 30: రియల్‌మీ నార్జో 30 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... ఇదిగో సాక్ష్యం (image: Realme)

Realme Narzo 30 Smartphones | ఇండియాలో పోటాపోటీగా స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి కంపెనీలు. త్వరలో రియల్‌మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రాబోతున్నాయి.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. త్వరలో రియల్‌మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రియల్‌మీ నార్జో సిరీస్‌లో పలు మోడల్స్‌ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ, రియల్‌మీ నార్జో 20, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 ప్రో మోడల్స్ రిలీజ్ అయ్యాయి. త్వరలో రియల్‌మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేయబోతోంది కంపెనీ. రియల్‌మీ నార్జో 30 సిరీస్ రీటైల్ బాక్స్ ఎలా ఉంటే బాగుంటుంది అంటూ రియల్‌మీ ఓ సర్వే చేస్తోంది. దీంతో ఈ ఫోన్స్‌ని త్వరలోనే రిలీజ్ చేయనుందన్న స్పష్టత వచ్చింది. వాస్తవానికి నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు 2021 జనవరిలో లాంఛ్ అవుతాయని భావించారు. కానీ జనవరిలో లాంఛింగ్ లేదు. ఇప్పుడు రీటైల్ బాక్సులకు సంబంధించిన సర్వే జరుగుతోంది. కాబట్టి త్వరలోనే నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాకు రానున్నాయి.

  Samsung Galaxy M02: రేపే సాంసంగ్ గెలాక్సీ ఎం02 సేల్... ధర రూ.7,000 లోపే

  WhatsApp: వాట్సప్ నుంచి మ్యూట్ వీడియో ఫీచర్... ఎలా పనిచేస్తుందంటే

  రియల్‌మీ నార్జో సిరీస్ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారి సంఖ్య 30 లక్షలు ఉన్నట్టు కంపెనీ ప్రకటించింది. ఇక నార్జో 20 సిరీస్‌లో వచ్చిన మూడు స్మార్ట్‌ఫోన్లు మొదటి వారంలోనే 230,000 యూనిట్స్ అమ్ముడుపోయినట్టు గతంలో కంపెనీ ప్రకటించింది. మరి రియల్‌మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఎలా ఉంటాయన్న క్లారిటీ లేదు. స్పెసిఫికేషన్స్ వివరాలు తెలియదు. నార్జో 10 సిరీస్‌లో రెండు ఫోన్లను మాత్రమే లాంఛ్ చేసిన రియల్‌మీ... నార్జో 20 సిరీస్‌లో మాత్రం 3 స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. మరి నార్జో 30 సిరీస్‌లో మూడు ఫోన్లు లాంఛ్ చేస్తుందా? లేక రెండే మోడల్స్‌ని పరిచయం చేస్తుందా అన్నది చూడాలి.

  Alexa: రోజుకు 19 వేల సార్లు అలెక్సాకు I Love You చెబుతున్న ఇండియన్స్

  Poco F2: బీ రెడీ... పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

  ఇక ఇటీవల రియల్‌మీ ఎక్స్ సిరీస్‌లో రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. సేల్ ఇంకా మొదలు కాలేదు. Realme X7 Pro 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 10 మధ్యాహ్నం 12 గంటలకు, Realme X7 5G స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫిబ్రవరి 12 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు