హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 30: రియల్​మీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​... ఫ్లిప్‌కార్ట్‌లో నార్జో 30 సేల్

Realme Narzo 30: రియల్​మీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​... ఫ్లిప్‌కార్ట్‌లో నార్జో 30 సేల్

Realme Narzo 30: రియల్​మీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​... ఫ్లిప్‌కార్ట్‌లో నార్జో 30 సేల్
(image: Realme India)

Realme Narzo 30: రియల్​మీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​... ఫ్లిప్‌కార్ట్‌లో నార్జో 30 సేల్ (image: Realme India)

Realme Narzo 30 | రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ కానున్నాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటాయి.

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ రియల్​మీ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్​. ఇటీవల గ్లోబల్​ మార్కెట్​లోకి లాంచ్​ అయిన రియల్​మీ నార్జో 30, నార్జో 30 5 జి స్మార్ట్​ఫోన్ల అమ్మకాలు జూన్​ 24 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ–కామర్స్​ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ద్వారా వీటి అమ్మకాలు జరగనున్నాయి. వీటి అమ్మకాలు జూన్ 24న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి. రియల్‌మీ నార్జో 30 మోడల్​ గత నెలలో మలేషియాలో విడుదలవ్వగా.. దాని 5 జి మోడల్​ మాత్రం యూరోపియన్ మార్కెట్లో విడుదలైంది. ఇప్పుడు ఈ రెండు 4జి, 5జి మోడల్స్​ ఒకేసారి భారత మార్కెట్​లో అమ్మకానికి రానున్నాయి.

ఫిబ్రవరిలో భారత మార్కెట్​లో ప్రారంభమైన నార్జో సిరీస్​లో ఈ రెండు సరికొత్త వేరియంట్లు వచ్చి చేరాయి. ఈ స్మార్ట్​ఫోన్​ అమ్మకాలపై రియల్‌మీ ఇండియా, యూరప్ సీఈఓ మాధవ్ శేత్ మాట్లాడుతూ ‘‘రియల్​మీ నార్జో సిరీస్​లో వస్తున్న నార్జో 30 4జి, 5జి రెండు వేరియంట్ల అమ్మకాలు జూన్ 24 న మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు ఫ్లిప్​కార్ట్​ ద్వారా జరుగుతాయి.” అని అన్నారు.

Samsung Galaxy M32: రూ.14,999 ధరతో సాంసంగ్ గెలాక్సీ ఎం32 రిలీజ్... ఫీచర్స్ ఇవే

WhatsApp Status: వాట్సప్ యూజర్లకు అలర్ట్... ఇక ఆ ఫీచర్ ఉండదు

స్పెసిఫికేషన్లు


రియల్​మీ నుంచి విడుదలైన ఈ రెండు ఫోన్లలో అద్భుతమైన ఫీచర్లను అందించారు. ఈ రెండు ఫోన్లు డ్యూయల్ సిమ్ (నానో) సపోర్ట్​తో వస్తాయి. ఇవి ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్​మీ యుఐ 2.0తో పనిచేస్తాయి. ఇవి 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్​ప్లే, 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ కలిగి ఉంటాయి. ఇక, 4 జి మోడల్ మీడియాటెక్ హెలియో జి 95 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. అదే విధంగా, 5 జి మోడల్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5 జి సోసి ప్రాసెసర్​తో పనిచేస్తుంది. 4జి మోడల్ 6 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ అయింది.

IBPS RRB 2021: మొత్తం 12,958 బ్యాంకు ఉద్యోగాలు... పోస్టుల సంఖ్య పెంచిన ఐబీపీఎస్

OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

ఈ డివైజ్ 5జి మోడల్.. 4 జిబి ర్యామ్​, 128 జిబి స్టోరేజ్​ ఆప్షన్‌లో లాంచ్ అయింది. ఫోటోలు, వీడియోల కోసం ఈ రెండూ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే.. వీటిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్‌, పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాలను అందించింది. ఇక, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్​ కెమెరా వంటివి చేర్చింది. సెల్ఫీలు, వీడియో చాట్‌ల కోసం, ఫోన్‌ ముందు భాగంలో ప్రత్యేకంగా16 మెగాపిక్సెల్ సెన్సార్​ కెమెరాను అందించారు.

ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్లలో వై-ఫై 802.11ac, బ్లూటూత్ వి 5, జిపిఎస్ / ఎ-జిపిఎస్, ఎన్‌ఎఫ్‌సి, యుఎస్‌బి టైప్-సి పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను రియల్‌మీ చేర్చింది. ఈ రెండు మోడళ్లలో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ అందించింది. రియల్‌మీ నార్జో30 4జి వేరియంట్​30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్​ ఇస్తుండగా, 5జి మోడల్‌ మాత్రం 18W ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్​తో వస్తుంది. కాగా, వీటి ధరను మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

ఉత్తమ కథలు