హోమ్ /వార్తలు /technology /

Realme Narzo 30 5G: తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ

Realme Narzo 30 5G: తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన రియల్‌మీ

Realme Narzo 30 5G | రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

Realme Narzo 30 5G | రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

Realme Narzo 30 5G | రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

    రియల్‌మీ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రియల్‌మీ నార్జో 30 5జీ మోడల్‌తో పాటు 4జీ మోడల్ కూడా రిలీజ్ అయింది. తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్లను ఇండియాలో లాంఛ్ చేస్తోంది రియల్‌మీ. మొదట రియల్‌మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఆ తర్వాత రూ.15,000 లోపు రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చి మరో సంచలనం సృష్టించింది. ఇంత తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఘనత రియల్‌మీదే. ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది. రియల్‌మీ నార్జో 30 5జీ మోడల్‌ను తక్కువ ధరకే పరిచయం చేసింది. రియల్‌మీ నార్జో 30 సరీస్‌లో రియల్‌మీ నార్జో 30ఏ, నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్‌లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ నార్జో 30 4జీ వచ్చి చేరాయి.

    రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌లో మాత్రమే రిలీజ్ అయింది. ధర రూ.15,999. జూన్ 30 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఇంట్రడక్టరీ సేల్ ఆఫర్‌లో భాగంగా రూ.500 తగ్గింపు లభిస్తుంది. ఇక రియల్‌మీ నార్జో 30 4జీ మోడల్ 4జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. రియల్‌మీ నార్జో 30 4జీబీ+64జీబీ ధర రూ.12,499 కాగా, 6జీబీ+128జీబీ ధర 14,499. జూన్ 29 మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. 4జీబీ+64జీబీ మోడల్‌పై ఇంట్రడక్టరీ ఆఫర్‌లో భాగంగా రూ.500 తగ్గింపు పొందొచ్చు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.

    Realme X7 Max: రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ కొత్త వేరియంట్ వచ్చింది... ఈరోజే సేల్

    Dual WhatsApp: ఒకే ఫోన్‌లో రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోండి ఇలా

    ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల స్పెసిఫికేషన్స్ దాదాపు ఒకేలా ఉన్నాయి. రియల్‌మీ నార్జో 30 4జీ మోడల్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెన్సార్‌తో ఇన్‌ డిస్‌ప్లే సెల్ఫీ కెమెరా ఉంది. రియల్‌మీ నార్జో 30 4జీ మోడల్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ కలర్స్‌లో రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.

    Mi 11 Lite: ఎంఐ 11 లైట్ వచ్చేసింది... రూ.3,000 డిస్కౌంట్ పొందండి ఇలా

    Motorola Rugged Mobile: ఈ స్మార్ట్‌ఫోన్‌ను నీళ్లల్లో నానబెట్టి, సబ్బుతో కడిగేయొచ్చు

    రియల్‌మీ నార్జో 30 5జీ మోడల్‌లో కూడా 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉండటం విశేషం. మీడియాటెక్ డైమెన్సిటీ 700 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్, 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని 18వాట్ ఫాస్ట్ క్విక్ సపోర్ట్ చేస్తుంది. రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ కలర్స్‌‌లో కొనొచ్చు. రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పోకో ఎం3 ప్రో 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ మోడల్స్‌కు పోటీ ఇవ్వనుంది.

    రియల్‌మీ నార్జో 30 5జీ, రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ 32 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ, రియల్‌మీ బడ్స్ క్యూ2 లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.17,999, రియల్‌మీ బడ్స్ క్యూ2 ధర రూ.2,499.

    First published:

    ఉత్తమ కథలు