హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్

Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్

Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్
(image: Realme India)

Realme Narzo 30: రియల్‌మీ మరో సంచలనం... ధర రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ (image: Realme India)

Realme Narzo 30 | రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో మరో మోడల్ రాబోతోంది. రియల్‌మీ నార్జో 30 4జీ, 5జీ మోడల్స్‌ను రిలీజ్ చేయనుంది కంపెనీ.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది. ఇటీవల ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వరుసగా 5జీ స్మార్ట్‌ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. పోకో ఎం3 ప్రో 5జీ, ఐకూ జెడ్3 5జీ, ఒప్పో ఏ53ఎస్ 5జీ లాంటి మొబైల్స్ ఈమధ్యే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు రియల్‌మీ మరో 5జీ స్మార్ట్‌ఫోన్ తీసుకురానుంది. ఇప్పటికే రియల్‌మీ రూ.15,000 లోపు రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. త్వరలో రూ.13,000 లోపు 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేయనుందన్న ప్రచారం జరుగుతోంది. రియల్‌మీ ఇప్పటికే నార్జో 30 సరీస్‌లో రియల్‌మీ నార్జో 30ఏ, నార్జో 30 ప్రో మోడల్స్‌ని పరిచయం చేసింది. కానీ ఇంకా రియల్‌మీ నార్జో 30 మోడల్‌ను ఇంకా రిలీజ్ చేయలేదు.

  Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

  Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,399 ధరకే కొనండి ఇలా

  త్వరలో రియల్‌మీ నార్జో 30 మోడల్‌ను రెండు వేరియంట్లలో రిలీజ్ చేయనుంది. 4జీ, 5జీ మోడల్స్‌ను పరిచయం చేయనుంది. ఈ విషయాన్ని రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ షేఠ్ ప్రకటించారు. రియల్‌మీ నార్జో 30 4జీ, రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్లు ఈ నెలలోనే రిలీజ్ కానున్నాయి. జూన్ 24న రియల్‌మీ ఈవెంట్ నిర్వహిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. ఇంకా అధికారిక సమాచారం లేదు. రియల్‌మీ నార్జో 30 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.10,000 సెగ్మెంట్‌లో, రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్ రూ.13,000 బడ్జెట్‌లో రిలీజ్ అవుతుందని అంచనా.

  Best 5G Smartphones: రూ.20,000 లోపు బెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే

  Best Smartphones Under Rs 20,000: కొత్త మొబైల్ కొంటున్నారా? రూ.20,000 లోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  ఇప్పటికే రియల్‌మీ నార్జో 30 మలేషియాలో రిలీజ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఉంది. కెమెరా విషయానికి వస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్లు ఉన్నాయి. సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రేసింగ్ బ్లూ, రేసింగ్ సిల్వర్ కలర్స్‌లో రిలీజ్ అయింది.

  మరి ఇండియాలో రిలీజ్ అయ్యే రియల్‌మీ నార్జో 30 4జీ, రియల్‌మీ నార్జో 30 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఇవే ఫీచర్స్ ఉంటాయా? ఇండియన్ యూజర్ల అవసరాలకు తగ్గట్టుగా ఏమైనా ఫీచర్స్ మారుస్తారా అన్న సంగతి తెలియాలి.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు