HOME »NEWS »TECHNOLOGY »realme narzo 20 series smartphones to release today know expected specifications ss

Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే

Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే
Realme Narzo 20: కాసేపట్లో రియల్‌మీ నార్జో 20 రిలీజ్... స్పెసిఫికేషన్స్ ఇవే (image: Realme India)

Realme Narzo 20 Series | రియల్‌మీ నుంచి నార్జో సిరీస్‌లో మూడు స్మార్ట్‌‌ఫోన్లు ఈ రోజు రిలీజ్ కానున్నాయి. ఇప్పటికే స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ నార్జో 20 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను ఈరోజు ఇండియాలో రిలీజ్ చేయనుంది. ఈ సిరీస్‌లో రియల్‌మీ నార్జో 20 ప్రో, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 మోడల్స్‌ని పరిచయం చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ టిప్‌స్టర్ రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ ట్విట్టర్‌లో లీక్ చేయడంతో ఆ స్పెక్స్ వైరల్‌గా మారాయి. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 4500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లాంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ మాత్రమే కాదు, రియల్‌మీ నార్జో 20ఏ, రియల్‌మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ కూడా లీక్ అయ్యాయి. అయితే ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ కరెక్టేనా అంటే చెప్పలేం. సెప్టెంబర్ 21న ఈ స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యే వరకు పూర్తి స్పెసిఫికేషన్స్ అంచనా వేయడం కష్టం.



    రియల్‌మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్ (అంచనా)
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+
    ర్యామ్: 6జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ95
    రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 4500ఎంఏహెచ్ బ్యాటరీ (65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: వైట్ నైట్, బ్లాక్ నిన్జా

    Poco X3: పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది... స్పెసిఫికేషన్స్ ఇవే

    Smartphone: రూ.20,000 లోపు బడ్జెట్‌లో 8 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

    రియల్‌మీ నార్జో 20ఏ స్పెసిఫికేషన్స్ (అంచనా)
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 3జీబీ, 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
    ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665
    రియర్ కెమెరా: 12+2+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ

    Infinix Note 7: పెద్ద డిస్‌ప్లే, భారీ బ్యాటరీ... ఇన్ఫీనిక్స్ నోట్ 7 రిలీజ్

    WhatsApp: వాట్సప్ యూజర్లకు సర్‌ప్రైజ్... ఈ మార్పు గమనించారా?


    రియల్‌మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్ (అంచనా)
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల హెచ్‌డీ+
    ర్యామ్: 4జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
    రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్
    ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ
    Published by:Santhosh Kumar S
    First published:September 21, 2020, 10:36 IST