రియల్మీ నార్జో 20 సిరీస్‌లో ఒకేసారి మూడు స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. రియల్మీ నార్జో 20, రియల్మీ నార్జో 20ఏ, రియల్మీ నార్జో 20 ప్రో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యాయి. చూడ్డానికి ఈ మూడు స్మార్ట్‌ఫోన్స్ ఒకేలా కనిపించినా స్పెసిఫికేషన్స్‌లో చాలా తేడాలు ఉన్నాయి. వీటిలో మొదట రియల్మీ నార్జో 20 ప్రో సేల్ సెప్టెంబర్ 25న జరగనుంది. రియల్మీ నార్జో 20 ప్రో ప్రారంభ ధర రూ.14,999. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఆ తర్వాత రియల్మీ నార్జో 20 సేల్ సెప్టెంబర్ 28న ఉంటుంది. ప్రారంభ ధర రూ.10,499. ఇక రియల్మీ నార్జో 20ఏ సేల్ సెప్టెంబర్ 30న ఉంటుంది. ప్రారంభ ధర రూ.8,499. ఇంతకుముందు నార్జో 10 సిరీస్‌లో రియల్మీ నార్జో 10, రియల్మీ నార్జో 10ఏ మోడల్స్ రిలీజ్ అయ్యాయి. కానీ ఈసారి నార్జో 20 సిరీస్‌లో మూడు మోడల్స్ వచ్చాయి. మరి ఈ మూడు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్‌లో ఎలాంటి తేడాలు ఉన్నాయో, మీకు ఏది బెస్ట్ స్మార్ట్ఫోనో తెలుసుకోండి.
రియల్మీ నార్జో 20 ప్రో | రియల్మీ నార్జో 20 | రియల్మీ నార్జో 20ఏ | |
డిస్ప్లే | 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే | 6.5 అంగుళాల హెచ్డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే | 6.5 అంగుళాల హెచ్డీ+ |
ర్యామ్ | 6జీబీ, 8జీబీ | 4జీబీ | 3జీబీ, 4జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ | 64జీబీ, 128జీబీ | 64జీబీ, 128జీబీ | 32జీబీ, 64జీబీ |
ప్రాసెసర్ | మీడియాటెక్ హీలియో జీ95 | మీడియాటెక్ హీలియో జీ85 | క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 |
రియర్ కెమెరా | 48+8+2+2 మెగాపిక్సెల్ | 48+8+2 మెగాపిక్సెల్ | 12+2+2 మెగాపిక్సెల్ |
ఫ్రంట్ కెమెరా | 16 మెగాపిక్సెల్ | 8 మెగాపిక్సెల్ | 8 మెగాపిక్సెల్ |
బ్యాటరీ | 4500ఎంఏహెచ్ బ్యాటరీ (65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్) | 6,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) | 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్) |
ఆపరేటింగ్ సిస్టమ్ | ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ | ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ | ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ |
సిమ్ సపోర్ట్ | డ్యూయెల్ సిమ్ | డ్యూయెల్ సిమ్ | డ్యూయెల్ సిమ్ |
కలర్స్ | వైట్ నైట్, బ్లాక్ నిన్జా | గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ | గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ |
ధర | 6జీబీ+64జీబీ- రూ.14,9998జీబీ+128జీబీ- రూ.16,999 | 4జీబీ+64జీబీ- రూ.10,4994జీబీ+128జీబీ- రూ.11,499 | 3జీబీ+32జీబీ- రూ.8,4994జీబీ+64జీబీ- రూ.9,499 |
Redmi 9i: కాసేపట్లో రెడ్మీ 9ఐ సేల్... రూ.10,000 లోపే 4GB+128GB స్మార్ట్‌ఫోన్
Samsung Galaxy M51: ఈరోజే సాంసంగ్ గెలాక్సీ ఎం51 ఫస్ట్ సేల్... రూ.2,000 డిస్కౌంట్
రియల్మీ నార్జో 20 ప్రో హైఎండ్ స్మార్ట్‌ఫోన్. 6జీబీ+64జీబీ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 38 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఇందులో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా ఉంది. 16మెగాపిక్సెల్ సోనీ కెమెరా ఉండటం విశేషం. పెర్ఫామెన్స్ బాగా ఉండాలని అనుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు.
ఇక రియల్మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ కాస్త తక్కువగా ఉన్నాయి. 4జీబీ+64జీబీ వేరియంట్ నుంచి మొదలవుతుంది. 6,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా ఉంది. బ్యాటరీ ఎక్కువ ఉండాలనుకునేవారికి ఇది బెస్ట్ ఫోన్.
రియల్మీ నార్జో 20ఏ బేసిక్ స్మార్ట్‌ఫోన్. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌తో ప్రారంభమవుతుంది. 12 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. బేసిక్ అవసరాల కోసం ఈ ఫోన్ కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android 10, Flipkart, Realme, Realme Narzo, Realme UI, Smartphone