
Realme Narzo 20 Pro: రియల్మీ నార్జో 20 స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్... ధర రూ.8,499 నుంచి
(image: Realme India)
Realme Narzo 20 Series | రెడ్మీ నార్జో 20 సిరీస్ స్మార్ట్ఫోన్లు రిలీజ్ అయ్యాయి. వీటి ధర రూ.8,499 నుంచి మొదలవుతుంది. స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.
రియల్మీ ఈ ఏడాది నార్జో సిరీస్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా నార్జో 10, నార్జో 10ఏ స్మార్ట్ఫోన్లను ఇప్పటికే రిలీజ్ చేసింది. ఇప్పుడు నార్జో 20 సిరీస్ స్మార్ట్ఫోన్లను పరిచయం చేసింది. ఈసారి ఏకంగా 3 స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేసింది. రియల్మీ నార్జో 20, రియల్మీ నార్జో 20ఏ, రియల్మీ నార్జో 20 ప్రో మోడల్స్‌ని ఆవిష్కరించింది రియల్మీ. మూడు ఫోన్లూ వేర్వేరు స్పెసిఫికేషన్స్‌తో వేర్వేరు సెగ్మెంట్లలో రిలీజ్ అయ్యాయి. రియల్మీ నార్జో 20ఏ ప్రారంభ ధర రూ.8,499 కాగా రియల్మీ నార్జో 20 ప్రారంభ ధర రూ.10,499. ఇక రియల్మీ నార్జో 20 ప్రో ప్రారంభ ధర రూ.14,999. రియల్మీ నార్జో 20ఏ సేల్ సెప్టెంబర్ 30న, రియల్మీ నార్జో 20 సేల్ సెప్టెంబర్ 28న, రియల్మీ నార్జో 20 ప్రో సేల్ సెప్టెంబర్ 25న ప్రారంభం కానుంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లిప్‌కార్ట్, రియల్మీ అధికారిక వెబ్సైట్, ఆఫ్‌లైన్ స్టోర్స్‌లో లభిస్తాయి. రియల్మీ నార్జో 20 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 10 శాతం డిస్కౌంట్ పొందొచ్చు. ఇక ఈ మూడు స్మార్ట్ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
రియల్మీ నార్జో 20 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+, 90Hz అల్ట్రా స్మూత్ డిస్ప్లే
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ95
రియర్ కెమెరా: 48+8+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4500ఎంఏహెచ్ బ్యాటరీ (65వాట్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: వైట్ నైట్, బ్లాక్ నిన్జా
ధర:
6జీబీ+64జీబీ- రూ.14,999
8జీబీ+128జీబీ- రూ.16,999
రియల్మీ నార్జో 20 స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+ మినీ డ్రాప్ ఫుల్ స్క్రీన్ డిస్ప్లే
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85
రియర్ కెమెరా: 48+8+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ
ధర:
4జీబీ+64జీబీ- రూ.10,499
4జీబీ+128జీబీ- రూ.11,499
రియల్మీ నార్జో 20ఏ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665
రియర్ కెమెరా: 12+2+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (10వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్మీ యూఐ
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లోరీ సిల్వర్, విక్టరీ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.8,499
4జీబీ+64జీబీ- రూ.9,499
Published by:Santhosh Kumar S
First published:September 21, 2020, 14:41 IST