రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ నార్జో 10ఏ హైఎండ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను 3జీబీ+32జీబీ వేరియంట్‌తో రియల్‌మీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వేరియంట్ ధర రూ.8,499. కాస్త ఎక్కువ ర్యామ్, మెమొరీ కావాలనుకునేవారి కోసం 4జీబీ+64జీబీ వేరియంట్‌కో రియల్‌మీ నార్జో 10ఏ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ధర రూ.9,999. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో జూన్ 23 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ కొనొచ్చు. పర్ఫామెన్స్, గేమింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునేవారిని టార్గెట్ చేస్తూ రియల్‌మీ నార్జో 10, రియల్‌మీ నార్జో 10ఏ మోడల్స్‌ని ఇటీవల కంపెనీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరా, నైట్‌స్కేప్ మోడ్, పోర్ట్‌రైట్ మోడ్, 5,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, 18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.