Realme Smart TV: రియల్‌మీ స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా

Realme Smart TV | ఇండియన్ స్మార్ట్ టీవీ మార్కెట్‌లోకి రియల్‌మీ వచ్చేసింది. రెండు స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది.

news18-telugu
Updated: May 25, 2020, 2:44 PM IST
Realme Smart TV: రియల్‌మీ స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా
Realme Smart TV: రియల్‌మీ స్మార్ట్ టీవీ వచ్చేసింది... ధర ఎంతో తెలుసా (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కొత్త స్మార్ట్‌ టీవీ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ నుంచి స్మార్ట్ టీవీ వచ్చేసింది. ఇవాళ ఇండియాలో స్మార్ట్ టీవీ, బడ్స్ ఎయిర్ నియో, స్మార్ట్ వాచ్, పవర్ బ్యాంక్ రిలీజ్ చేసింది కంపెనీ. షావోమీకి పోటీ ఇచ్చేందుకు స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది రియల్‌మీ. రియల్‌మీ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.12,999 మాత్రమే. రియల్‌మీ స్మార్ట్ టీవీ 32 అంగుళాలు, 43 అంగుళాల సైజ్‌లో లభిస్తుంది. 32 అంగుళాల స్మార్ట్ టీవీ ధర రూ.12,999 కాగా, 43 అంగుళాల టీవీ ధర రూ.21,999. జూన్ 2 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ మొదలవుతుంది. త్వరలో ఆఫ్‌లైన్‌లో కూడా రియల్‌మీ స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వస్తాయి.

రియల్‌మీ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ చూస్తే 32 అంగుళాల టీవీ రెజల్యూషన్ 1366x768 పిక్సెల్స్ (హెచ్‌డీ రెడీ), 43 అంగుళాల టీవీ రెజల్యూషన్ 1920x1080 పిక్సెల్స్ (ఫుల్ హెచ్‌డీ). మిగతా ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయి. ఆండ్రాయిడ్ టీవీ 9 పై ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. గూగుల్ ప్లే స్టోర్ ఉపయోగించుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్ లాంటి యాప్స్ ప్రీ-ఇన్‌స్టాల్డ్‌గా వస్తుంది. 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. మీడియాటెక్ MSD6683 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4 స్పీకర్ సిస్టమ్ ఉంటుంది. సౌండ్ ఔట్‌పుట్ 24 వాట్స్.


రియల్‌మీ స్మార్ట్ టీవీతో పాటు రియల్‌మీ బడ్స్ ఎయిర్ నియో ట్రూ వైర్‌లెస్ ఇయర్ ఫోన్స్‌ను రూ.2,999 ధరకు, రియల్‌మీ స్మార్ట్ వాచ్‌ను రూ.3,999 ధరకు, రియల్‌మీ 10000ఎంఏహెచ్ పవర్ బ్యాంకును రూ.999 ధరకు రిలీజ్ చేసింది కంపెనీ.

ఇవి కూడా చదవండి:

Smartphone: రూ.12,000 లోపు బెస్ట్ 6 స్మార్ట్‌ఫోన్లు ఇవే

Mobile Apps: లాక్‌డౌన్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ చేసిన 10 యాప్స్ ఇవే

Jio New Plans: ఎక్కువ 4జీ డేటాతో జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇవే
Published by: Santhosh Kumar S
First published: May 25, 2020, 2:44 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading