హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే

Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే

Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే
(image: Realme India)

Realme X7 Max 5G: ఇండియాలో రిలీజ్ అయిన రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ... ధర ఎంతంటే (image: Realme India)

Realme X7 Max 5G | రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే రెండు మోడల్స్‌ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. వీటి ధరలు, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఇండియాలో రియల్‌మీ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. చైనాలో మార్చిలో రిలీజ్ అయిన రియల్‌మీ జీటీ నియో మోడల్‌ను రీబ్రాండెడ్ చేసి రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్‌ని గతంలోనే అధికారికంగా ప్రకటించింది రియల్‌మీ. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్, 120Hz సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్‌తో ట్రిపుల్ కెమెరా లాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ప్రారంభ ధర రూ.26,999. జూన్ 4న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ప్రధానమైన ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది.

  రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz డిస్‌ప్లేతో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. రియర్ కెమెరా సెటప్ చూస్తే 64 మెగాపిక్సెల్ Sony IMX682 సెన్సార్‌ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరాలు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్. రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ 5జీ సిమ్ సపోర్ట్ కూడా ఉంది.

  Google Photos: గూగుల్ ఫోటోస్‌లో రేపటి నుంచి అన్‌లిమిటెడ్ స్టోరేజ్ ఉండదు

  Top 10 Smartphones: ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడుపోయిన 10 స్మార్ట్‌ఫోన్లు ఇవే...

  రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మెర్క్యురీ సిల్వర్, ఆస్టరాయిడ్ బ్లాక్, మిల్కీ వే కలర్స్‌లో కొనొచ్చు. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.26,999 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. ఇక రియల్‌మీ అప్‌గ్రేడ్ ప్రోగ్రామ్ ద్వారా కొంటే 70 శాతం డబ్బులు మాత్రం చెల్లిస్తే చాలు. ఏడాది తర్వాత రియల్‌మీ రిలీజ్ చేయబోయే కొత్త స్మార్ట్‌ఫోన్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు.

  Redmi Note 10 Pro 5G: రెడ్‌మి నోట్ 10 ప్రో 5జీ రిలీజ్... ఫీచర్స్ ఇవే

  Mi 11 Ultra: గత నెలలో రిలీజైన ఎంఐ 11 అల్‌ట్రా... ఇంకా మొదలుకాని సేల్

  రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్‌ను కూడా రిలీజ్ చేసింది కంపెనీ. 43 అంగుళాలు, 50 అంగుళాల మోడల్స్‌ను రిలీజ్ చేసింది. హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ పోర్ట్స్‌తో పాటు వైఫై, బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది. రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే మోడల్‌లో 2జీబీ ర్యామ్, 16జీబీ స్టోరేజ్, 24వాట్ స్పీకర్, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే 43 అంగుళాల టీవీ ధర రూ.27,999 కాగా, 50 అంగుళాల టీవీ ధర రూ.39,999. జూన్ 4 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ వెబ్‌సైట్, రీటైల్ స్టోర్లలో రియల్‌మీ స్మార్ట్ టీవీ 4కే కొనొచ్చు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు