Realme 5 Pro: అద్భుతమైన ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 5 ప్రో

Realme 5 Pro | రియల్‌మీ 5 ప్రోస్మార్ట్‌ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత.

news18-telugu
Updated: August 20, 2019, 2:13 PM IST
Realme 5 Pro: అద్భుతమైన ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 5 ప్రో
Realme 5 Pro: అద్భుతమైన ఫీచర్లతో రిలీజైన రియల్‌మీ 5 ప్రో
news18-telugu
Updated: August 20, 2019, 2:13 PM IST
రియల్‌మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో లాంఛైంది. ఇండియాలో ఇప్పటికే రియల్‌మీ 1, 2, 3 సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసిన రియల్‌మీ... ఇప్పుడు 5 సిరీస్‌ను తీసుకొచ్చింది. 4 అంకెను చైనాలో అన్‌లక్కీ నెంబర్‌గా భావిస్తారు. అందుకే చైనా కంపెనీ అయిన రియల్‌మీ 4 సిరీస్ కాకుండా నేరుగా 5 సిరీస్ లాంఛ్ చేసిందన్న వాదన ఉంది. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్‌ను టార్గెట్ చేసుకొని మార్కెట్‌లోకి రెండు ఫోన్లను రిలీజ్ చేసింది రియల్‌మీ. ఇక రియల్‌మీ 5 ప్రో విషయానికి వస్తే... ఈ ఫోన్ గురించి కొంతకాలంగా టీజర్లతో ఊరిస్తోంది రియల్‌మీ. మంగళవారం అధికారికంగా లాంఛ్ చేసింది. రియల్‌మీ 5 ప్రోస్మార్ట్‌ఫోన్‌లో నాలుగు కెమెరాలు ఉండటం విశేషం. 48 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉండటం ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. అల్ట్రావైడ్ లెన్స్, Sony IMX586 ప్రైమరీ లెన్స్, పోర్ట్‌రైట్ లెన్స్, మ్యాక్రో లెన్స్‌తో నాలుగు కెమెరాల స్మార్ట్‌ఫోన్ ఇది. స్నాప్‌డ్రాగన్ 712 ఏఐ ప్రాసెసర్, 16 మెగాపిక్సెల్ Sony IMX471 సెల్ఫీ కెమెరా, 4035 ఎంఏహెచ్ బ్యాటరీ, 90.6 స్క్రీన్ టు బాడీ రేషియో, VOOC 3.0 20 వాట్ ఛార్జింగ్ సపోర్ట్, టైప్ సీ ఛార్జర్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ 5 ప్రో ప్రీ-ఆర్డర్ ఆగస్ట్ 28న ప్రారంభం అవుతుంది.

రియల్‌మీ 5 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 ఫుల్‌హెచ్‌డీ+

ర్యామ్: 4జీబీ, 6 జీబీ, 8 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128 జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 712
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
Loading...
ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్ Sony IMX471
బ్యాటరీ: 4035 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 6
కలర్స్: క్రిస్టల్ గ్రీన్, స్పార్కింగ్ బ్లూ
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+64జీబీ- రూ.14,999
8జీబీ+128జీబీ- రూ.16,999

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

Jio GigaFiber: జియో గిగాఫైబర్ కనెక్షన్‌తో టీవీ ఉచితం... రిజిస్టర్ చేసుకోండి ఇలా

SBI IMPS: డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలా? ఐఎంపీఎస్ వాడుకోండి ఇలా
First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...