Realme PaySa: రూ.1 లక్ష వరకు అప్పు ఇస్తామంటున్న రియల్‌మీ... క్రెడిట్ స్కోర్ కూడా ఉచితం

Realme PaySa | కస్టమర్లతో పాటు చిరు వ్యాపారులు 'రియల్‌మీ పేసా' యాప్ ద్వారా రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకోవచ్చు.

news18-telugu
Updated: December 17, 2019, 5:07 PM IST
Realme PaySa: రూ.1 లక్ష వరకు అప్పు ఇస్తామంటున్న రియల్‌మీ... క్రెడిట్ స్కోర్ కూడా ఉచితం
Realme PaySa: రూ.1 లక్ష వరకు అప్పు ఇస్తామంటున్న రియల్‌మీ... క్రెడిట్ స్కోర్ కూడా ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన రియల్‌మీ ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టింది. కొద్ది రోజుల క్రితమే మరో స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ 'ఎంఐ క్రెడిట్'తో ఆర్థిక సేవల రంగంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అన్ని అంశాల్లో షావోమీకి పోటీ ఇస్తున్న రియల్‌మీ ఇప్పుడు ఎంఐ క్రెడిట్‌కు పోటీగా 'రియల్‌మీ పేసా' యాప్‌ని లాంఛ్ చేసింది. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ యాప్. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ అందుబాటులో ఉంది. ప్రస్తుతం ఇది బీటా యాప్ మాత్రమే. కొన్ని నెలలు పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో రిలీజ్ కానుంది. ఫిన్‌టెక్ కంపెనీ అయిన క్రెడిట్ మంత్రీతో కలిసి 'రియల్‌మీ పేసా' యాప్ రూపొందించింది స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్‌మీ. ప్రస్తుతం 'రియల్‌మీ పేసా' యాప్ ద్వారా ఉచితంగా క్రెడిట్ రిపోర్ట్, పర్సనల్ లోన్, స్క్రీన్ ఇన్స్యూరెన్స్, బిజినెస్ లోన్ లాంటి సేవల్ని ప్రధానంగా అందిస్తోంది రియల్‌మీ.

కస్టమర్లతో పాటు చిరు వ్యాపారులు 'రియల్‌మీ పేసా' యాప్ ద్వారా రూ.50,000 నుంచి రూ.50 లక్షల వరకు బిజినెస్ లోన్ తీసుకోవచ్చు. 12 నెలల నుంచి 60 నెలల కాలంలో అప్పు తీర్చొచ్చు. పర్సనల్ లోన్ రూ.8,000 నుంచి రూ.1,00,000 వరకు తీసుకోవచ్చు. 3 నెలల నుంచి 12 నెలల్లో చెల్లించాలి. ఇక దాంతో పాటు మ్యూచువల్ ఫండ్స్, సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మనీ ట్రాన్స్‌ఫర్ చేయడంతో పాటు బిల్ పేమెంట్స్ కూడా చేయొచ్చు. మీ క్రెడిట్ స్కోర్‌ను ఈ యాప్‌లో మొదటి మూడు నెలల్లో మూడుసార్లు ఉచితంగా తెలుసుకోవచ్చు. ఫేషియల్ రికగ్నిషన్, ఫింగర్‌ప్రింట్ లాంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఛాట్ బేస్డ్ కస్టమర్ సర్వీస్‌ని అందిస్తోంది రియల్‌మీ. పేటీఎం మనీ, గూగుల్ పే, ఎంఐ క్రెడిట్ లాంటి సంస్థలకు పోటీ ఇవ్వనుంది 'రియల్‌మీ పేసా'.

Realme X2: రియల్‌మీ ఎక్స్2 రిలీజ్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Realme X2: రియల్‌మీ ఎక్స్2 వచ్చేసింది... ధర ఎంతో తెలుసా?

Flipkart Year End Sale 2019: భారీ ఆఫర్లతో 'ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ 2019'... డిస్కౌంట్స్ ఇవేIRCTC: కేరళ టూర్ వెళ్లాలనుకునేవారికి గుడ్ న్యూస్... విశాఖపట్నం నుంచి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ
Published by: Santhosh Kumar S
First published: December 17, 2019, 5:04 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading