Realme: రియల్​మీ నార్జో 50 సిరీస్, ఫిట్​నెస్​ బ్యాండ్, స్మార్ట్​టీవీ​ లాంచ్​..Sale ఎప్పుడంటే..?

(image: Realme India)

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్రియల్ మీ రోజురోజుకు తన మార్కెను విస్తరిస్తోంది. Realme తాజాగా Narzo 50 సిరీస్​, ఫిట్​నెస్​ బ్యాండ్​, స్మార్ట్​టీవీనిలాంచ్​ చేయనున్నట్లు ప్రకటించింది.రియల్ మీ Narzo 50 సిరీస్​తో పాటుబ్యాండ్​2 ఫిట్ నెస్ బ్యాండ్,స్మార్ట్ టీవీ నియోను భారత్​లో లాంచ్ చేయనున్నట్టు పేర్కొంది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్రియల్ మీ రోజురోజుకు తన మార్కెను విస్తరిస్తోంది. Realme తాజాగా Narzo 50 సిరీస్​, ఫిట్​నెస్​ బ్యాండ్​, స్మార్ట్​టీవీనిలాంచ్​ చేయనున్నట్లు ప్రకటించింది.రియల్ మీ Narzo 50 సిరీస్​తో పాటుబ్యాండ్​2 ఫిట్ నెస్ బ్యాండ్,స్మార్ట్ టీవీ నియోను భారత్​లో లాంచ్ చేయనున్నట్టు పేర్కొంది. సెప్టెంబర్ 24న వీటి అమ్మకాలు ప్రారంభమవుతాయనిప్రకటించింది.Narzo 30 సిరీస్​ తర్వాత Realme నుంచి విడుదలవుతున్న నెక్ట్స్​ సిరీస్​ ఇదే కావడం విశేషం.అలాగే.. మార్చి 2020లో ఫస్ట్ జనరేషన్ రియల్ మీ బ్యాండ్​కు కొనసాగింపుగా ఇప్పుడు రియల్ మీ బ్యాండ్ 2ను లాంచ్ చేస్తోంది.ఇక.. రియల్ మీ Narzo 50 సిరీస్ లో భాగంగా.. రియల్ మీ Narzo 50ఏ, రియల్ మీ Narzo 50, రియల్ మీ Narzo 50 ప్రో మోడల్ ఫోన్లను రానున్నాయి.ఈ స్మార్ట్ ఫోన్లు సరికొత్త ఫీచర్లతో విడుదల కానున్నాయి. వీటిలో మీడియాటెక్ హీలియో జీ85 ఎస్వోసీ చిప్ ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, ట్రిపుల్ కెమెరా సెటప్ తో 50 ఎంపీ రేర్ కెమెరా, వాటర్ డ్రాప్ నోట్చ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ స్కానర్ లాంటి ఫీచర్లను అందించనున్నారు.రియల్ మీ Narzo 30 సిరీస్​లోనూ Narzo 30ఏ, Narzo 30 ప్రో 5జీ, Narzo 30 5జీ ఫోన్లను గతంలో Realme రిలీజ్ చేసింది.

ఇది చదవండి... iPhone 13 sale offer: ఐఫోన్ 13 సిరీస్​ ప్రీ ఆర్డర్లు ప్రారంభం.. ఇలా చేస్తే రూ. 6 వేల వరకు డిస్కౌంట్

అదిరిపోయే ఫీచర్లు..

రియల్ మీ బ్యాండ్ 2 కూడా అత్యాధునికమైన ఫీచర్లతో రానుంది. 1.4 ఇంచ్ స్క్వైర్ డిస్ ప్లే, టచ్ సపోర్ట్, హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్ లేవల్స్(ఎస్ పీవో2) ట్రాకింగ్ చేసే అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. అయితే.. ఫిట్ నెస్ బ్యాండ్ చూడటానికి మాత్రం హువాయ్ బ్యాండ్ 6 ఫిట్ నెస్ బ్యాండ్ ను పోలి ఉంటుంది. రియల్ మీ లో స్మార్ట్ టీవీ సిరీస్ లు ఇప్పటికే చాలా విడుదలయ్యాయి. సేల్స్ కూడా కొనసాగుతున్నాయి. అయితే.. మరిన్ని ఫీచర్లను జోడించి రియల్ మీనియో 32 ఇంచ్ టీవీని అదే ఈవెంట్ లాంచ్లో​ చేయనుంది. దీనితో పాటు ఒకేసారిస్మార్ట్ ఫోన్, ఫిట్ నెస్ బ్యాండ్​ను కూడా రియల్ చేయనుంది. ఈ స్మార్ట్ టీవీలో బెజెల్ లెస్ ఎల్ఈడీ డిస్ ప్లే, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో 20 వాట్స్ స్పీకర్ లాంటి ఫీచర్లతో వస్తుంది.రియల్ మీ ఇప్పటికే.. ఫుల్ హెచ్ డీ స్మార్ట్ టీవీసిరీస్లను భారత్​లో​ విక్రయిస్తోంది. వాటి ధర రూ. 20 వేల లోపే ఉంది.
Published by:Krishna Adithya
First published: