Realme XT: ప్రపంచంలోనే తొలి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్‌టీ

Realme XT | రియల్‌మీ ఎక్స్ ఫ్రంట్‌లో మాత్రమే కాదు వెనుకవైపు గొరిల్లా గ్లాస్ 5 ఉండటం విశేషం. రియల్‌మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ పవర్ బ్యాంక్, రియల్‌మీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ రిలీజ్ చేసింది కంపెనీ.

news18-telugu
Updated: September 13, 2019, 1:39 PM IST
Realme XT: ప్రపంచంలోనే తొలి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్‌టీ
Realme XT: ప్రపంచంలోనే తొలి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్... ఇండియాలో రిలీజైన రియల్‌మీ ఎక్స్‌టీ (image: Realme)
  • Share this:
స్మార్ట్‌‌ఫోన్ యూజర్లకు శుభవార్త. రియల్‌మీ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. గతంలో రిలీజ్ చేసిన రియల్‌మీ ఎక్స్ మోడల్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ రియల్‌మీ ఎక్స్‌టీ. ప్రపంచంలోనే తొలి 64 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ ఇది. వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటే అందులో ఒక లెన్స్ 64 మెగాపిక్సెల్ కావడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేస్తే క్వాడ్ కెమెరా ఇది. రియల్‌మీ ఎక్స్ ఫ్రంట్‌లో మాత్రమే కాదు వెనుకవైపు గొరిల్లా గ్లాస్ 5 ఉండటం విశేషం. రియల్‌మీ ఎక్స్‌టీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు రియల్‌మీ పవర్ బ్యాంక్, రియల్‌మీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ రిలీజ్ చేసింది కంపెనీ. 10,000 ఎంఏహెచ్ రియల్‌మీ పవర్ బ్యాంక్ ధర రూ.1,299. రియల్‌మీ వైర్‌లెస్ ఇయర్ బడ్స్ ధర రూ.1,799. రియల్‌మీ ఎక్స్‌టీ సేల్ సెప్టెంబర్ 16న ఫ్లిప్‌‌కార్ట్‌లో ప్రారంభం కానుంది.

రియల్‌మీ ఎక్స్‌టీ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

ర్యామ్: 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ


ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 712
రియర్ కెమెరా: 64+8+2+2 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + కలర్ ఓఎస్ 6.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: పెరల్ వైట్, పెరల్ బ్లూ
ధర:
4 జీబీ + 64 జీబీ- రూ.15,999
6 జీబీ + 64 జీబీ- రూ.16,999
8 జీబీ + 128 జీబీ - రూ.18,999

ఇవి కూడా చదవండి:

Apple Watch: యాపిల్ సిరీస్ 5 స్మార్ట్‌వాచ్‌లో అదిరిపోయే ఫీచర్లు... ధర ఎంతో తెలుసా?


ఇవి కూడా చదవండి:

Flipkart Sale: సెప్టెంబర్ 29 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్... ఆఫర్లు తెలుసుకోండి

Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి

IRCTC: రైల్వే స్టేషన్‌లో రిటైరింగ్ రూమ్‌ బుక్ చేయండి ఇలా...
First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>