రియల్మీ మరో సంచలనం సృష్టించింది. ఒకే రోజు మూడు స్మార్ట్ఫోన్లు రిలీజ్ చేసింది. అది కూడా రూ.10,000 లోపు బడ్జెట్లోనే. రియల్మీ సీ సిరీస్‌లో బడ్జెట్ స్మార్ట్ఫోన్లను గతంలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ స్మార్ట్ఫోన్లను అప్‌గ్రేడ్ చేస్తూ సీ సిరీస్‌లోనే మరో మూడు కొత్త మోడల్స్‌ని పరిచయం చేసింది. రియల్మీ సీ20, రియల్మీ సీ21, రియల్మీ సీ25 మోడల్స్‌ని రిలీజ్ చేసింది. మూడు స్మార్ట్ఫోన్ల ఫీచర్స్ వేర్వేరుగా ఉన్నాయి. రియల్మీ సీ20, సీ21 మోడల్స్‌లో స్పెసిఫికేషన్స్, డిజైన్ కాస్త దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్మార్ట్ఫోన్ల ప్రారంభ ధర రూ.6,999. రియల్మీ సీ20 స్మార్ట్‌ఫోన్ సేల్ ఏప్రిల్ 13 మధ్యాహ్నం 12 గంటలకు, రియల్మీ సీ21 సేల్ ఏప్రిల్ 14 మధ్యాహ్నం 12 గంటలకు, రియల్మీ సీ25 సేల్ ఏప్రిల్ 16 మధ్యాహ్నం 12 గంటలకు మొదలవుతుంది. రియల్మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.