Realme Pad: రియల్‌మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్... ధర రూ.15,000 లోపే

Realme Pad: రియల్‌మీ నుంచి తొలి ట్యాబ్లెట్ రిలీజ్... ధర రూ.15,000 లోపే (image: Realme)

Realme Pad | ఆన్‌లైన్ క్లాసుల కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా? వీకెండ్‌లో సినిమాలు చూసేందుకు, వీడియో గేమ్స్ ఆడేందుకు మంచి ట్యాబ్ (Tablet) కోసం చూస్తున్నారా? రియల్‍మీ తొలి ట్యాబ్లెట్‌ను (Realme Pad) ఇండియాలో రిలీజ్ చేసింది.

  • Share this:
    రియల్‌మీ ప్యాడ్ (Realme Pad) పేరుతో ఈ ట్యాబ్లెట్‌ను ఇండియాకు పరిచయం చేసింది. ఇండియాలో రియల్‌మీ 8ఐ (Realme 8i), రియల్‌మీ 8ఎస్ 5జీ (Realme 8s 5G) స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ ప్యాడ్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీ మార్కెట్‌లో పట్టు సాధించిన రియల్‌మీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ మార్కెట్ పైనా దృష్టి పెట్టింది. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావంతో ఆన్‌లైన్ క్లాసులు, ఆన్‌లైన్ కోర్సులకు డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మంచి ట్యాబ్లెట్ కొనాలని చూస్తున్నవారు ఎక్కువ. అంతేకాదు... వీకెండ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారు. ఇలాంటివారిని టార్గెట్ చేస్తూ రియల్‌మీ ట్యాబ్‌ను పరిచయం చేసింది.

    Redmi 10 prime vs Redmi Note 10: ఈ రెండు రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

    రియల్‌మీ ప్యాడ్ స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ ప్యాడ్ వైఫై ఆప్షన్‌తో వచ్చే 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ కేవలం వస్తుంది. ధర రూ.13.999. ఇదే వేరియంట్‌తో ఎల్‌టీఈ ఆప్షన్ కూడా ఉంది. ధర రూ.15.999. ఇక హైఎండ్ వేరియంట్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వైఫై+4జీ ఎల్‌టీఈ ఆప్షన్‌తో వస్తుంది. ధర రూ.17,999. వీటిలో ఎల్‌టీఈ మోడల్స్ సేల్ సెప్టెంబర్ 16న ప్రారంభం అవుతుంది. వైఫై వేరియంట్ సేల్ త్వరలో జరగనుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది.

    Vivo Y33s: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.15,500 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్.. రూ.2,490 ధరకే మొబైల్ కొనొచ్చు


    రియల్‌మీ ప్యాడ్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 10.4 అంగుళాల WUXGA+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ హీలియో జీ80 గేమింగ్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్స్ ఉండటం విశేషం. ఇందులో 7,100ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. 18వాట్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో రెండు 8 మెగాపిక్సెల్ కెమెరాలు ఉన్నాయి. ఒకటి ముందువైపు, ఒకటి వెనుకవైపు ఉంటుంది. రియల్‌మీ ప్యాడ్‌ను రియల్ గోల్డ్, రియల్ గ్రే కలర్స్‌లో కొనొచ్చు.

    రియల్‌మీ స్పీకర్స్


    రియల్‌మీ 8ఐ, రియల్‌మీ 8ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్లు, రియల్‌మీ ప్యాడ్‌తో పాటు రియల్‌మీ కాబల్ బ్లూటూత్ స్పీకర్, రియల్‌మీ పాకెట్ బ్లూటూత్ స్పీకర్ లాంఛ్ అయ్యాయి. రియల్‌మీ కాబల్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1,799. ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.1,499. మెటల్ బ్లాక్, ఎలక్ట్రానిక్ బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. ఇక పాకెట్ బ్లూటూత్ స్పీకర్ ధర రూ.1,099. ఇంట్రడక్టరీ ప్రైస్ రూ.999. క్లాసిక్ బ్లాక్, డిసర్ట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. సెప్టెంబర్ 15న సేల్ మొదలవుతుంది.
    Published by:Santhosh Kumar S
    First published: