హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme Narzo 30 Pro: రియల్‌మీ సంచలనం... తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ ఇవే

Realme Narzo 30 Pro: రియల్‌మీ సంచలనం... తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ ఇవే

Realme Narzo 30 Pro: రియల్‌మీ సంచలనం... తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ ఇవే
(image: Realme India)

Realme Narzo 30 Pro: రియల్‌మీ సంచలనం... తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ ఇవే (image: Realme India)

Realme Narzo 30 Pro | రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. రియల్‌మీ నార్జో 30 ప్రో, రియల్‌మీ నార్జో 30ఏ ప్రత్యేకతలు తెలుసుకోండి.

  ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనాకు చెందిన కంపెనీ రియల్‌మీ మరో సంచలనం సృష్టించింది. తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రియల్‌మీ నార్జో 30 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తామని రియల్‌మీ ప్రకటించిన సంగతి తెలిసిందే. రియల్‌మీ నార్జో 30 ప్రో, రియల్‌మీ నార్జో 30ఏ మోడల్స్ ఇండియాలో లాంఛ్ అయ్యాయి. వీటిలో రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్. దీంతో పాటు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నార్జో 30ఏ కూడా రిలీజైంది. రియల్‌మీ నార్జో 30 సిరీస్‌లో కేవలం రెండు మోడల్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. గతంలో రియల్‌మీ నార్జో 20 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రియల్‌మీ నార్జో 30 ప్రో విశేషాలు చూస్తే ఇది ఇండియాలో తక్కువ ధరలో లభించే 5జీ స్మార్ట్‌ఫోన్.

  రియల్‌మీ నార్జో 30 ప్రో స్మార్ట్‌ఫోన్ 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.16,999 కాగా 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.19,999. మార్చి 4న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ మొదలవుతుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక రియల్‌మీ నార్జో 30ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ.8,999 కాగా, 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.9,999. రియల్‌మీ నార్జో 30ఏ సేల్ మార్చి 5న ఫ్లిప్‌కార్ట్‌లో మొదలవుతుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు బడ్స్ ఎయిర్ 2 ట్రూలీ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ లాంఛ్ అయింది. ధర రూ.3,299.

  Exchange Offer: రూ.10,999 విలువైన స్మార్ట్‌ఫోన్ కేవలం రూ.649 ధరకే సొంతం చేసుకోండి... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

  Amazon Fab Phones Fest: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,000 డిస్కౌంట్... అమెజాన్ సేల్‌లో ఆఫర్

  రియల్‌మీ నార్జో 30 ప్రో ఫీచర్స్ చూస్తే 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో అల్‌ట్రా 48ఎంపీ మోడ్, సూపర్ నైట్‌స్కేప్ మోడ్, నైట్ ఫిల్టర్స్, క్రోమా బూస్ట్, పనోరమిక్ వ్యూ, ఎక్స్‌పర్ట్, టైమ్‌ల్యాప్స్, హెచ్‌డీఆర్, అల్‌ట్రా వైడ్, అల్‌ట్రా మ్యాక్రో, ఏఐ సీన్ రికగ్నిషన్, ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

  రియల్‌మీ నార్జో 30 ప్రో స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే

  ర్యామ్: 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 800యూ

  రియర్ కెమెరా: 48మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్

  ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 5,000ఎంఏహెచ్ (30వాట్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: స్వార్డ్ బ్లాక్, బ్లేడ్ సిల్వర్

  ధర:

  6జీబీ+64జీబీ- రూ.16,999

  8జీబీ+128జీబీ- రూ.19,999

  Big Battery Smartphones: ఛార్జింగ్ సరిపోవట్లేదా... భారీ బ్యాటరీతో లభించే స్మార్ట్‌ఫోన్స్ ఇవే

  Moto E7 Power: భారీ బ్యాటరీతో మోటో ఈ7 పవర్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర రూ.7,499 నుంచి

  రియల్‌మీ నార్జో 30ఏ స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే

  ర్యామ్: 3జీబీ, 4జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ85

  రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్

  ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

  బ్యాటరీ: 6000ఎంఏహెచ్ (18వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  కలర్స్: లేజర్ బ్లాక్, లేజర్ బ్లూ

  ధర:

  3జీబీ+32జీబీ- రూ.8,999

  4జీబీ+64జీబీ- రూ.9,999

  రియల్‌మీ తక్కువ ధరకే లాంఛ్ చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ నార్జో 30 ప్రో... ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీ ఇవ్వనుంది. ఎంఐ 10ఐ, మోటో జీ 5జీ లాంటి మోడల్స్‌కు పోటీ తప్పదు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme Narzo, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు