• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • REALME LAUNCHED CHEAPEST 5G SMARTPHONE REALME 8 5G IN INDIA PRICE STARTS AT RS 14999 KNOW SPECIFICATIONS SS

Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్

Realme 8 5G: రియల్‌మీ సంచలనం... రూ.14,999 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (image: Realme India)

Realme 8 5G | మీరు 5జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? రియల్‌మీ రూ.15,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. రియల్‌మీ 8 5జీ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ మరో సంచలనం సృష్టించింది. తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. రియల్‌మీ 8 5జీ మోడల్‌ను రిలీజ్ చేస్తామని కొంతకాలం క్రితమే రియల్‌మీ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా రిలీజ్ అయింది. రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.14,999. ఇది 4జీబీ+128జీబీ వేరియంట్ ధర. దీంతో పాటు 8జీబీ+128జీబీ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.16,999. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లలో ఉన్న 5జీ స్మార్ట్‌ఫోన్లతో పోలిస్తే రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ధరే తక్కువ. కేవలం రూ.15,000 ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. రియల్‌మీ 8 5జీ సేల్ ఏప్రిల్ 28 మధ్యాహ్నం 12 గంలకు మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో, ఆఫ్‌లైన్ స్టోర్లలో కొనొచ్చు. ఇండియన్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్‌లో కూడా రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది కంపెనీ.

    WhatsApp: వాట్సప్ వాడేవాళ్లు అస్సలు ఈ తప్పులు చేయొద్దు

    Samsung Galaxy A32: ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.3,000 తగ్గింది... రూ.1,500 డిస్కౌంట్ కూడా

    రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ఇటీవల థాయ్‌ల్యాండ్‌లో రిలీజ్ అయింది. రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్, 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. కెమెరాలో నైట్‌స్కేప్, 48ఎం మోడ్, ప్రో మోడ్, ఏఐ స్కాన్, సూపర్ మ్యాక్రో లాంటి ప్రత్యేకతలున్నాయి. ఫ్రంట్ కెమెరాలో కూడా పోర్ట్‌రైట్, నైట్‌స్కేప్, టైమ్‌ల్యాప్స్ ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ టెక్నాలజీ ఉంది. బిల్ట్ ఇన్ స్టోరేజ్‌ను వర్చువల్ ర్యామ్‌గా మార్చే టెక్నాలజీ ఇది.

    WhatsApp: వాట్సప్‌లో ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

    Poco M2 Reloaded: పోకో ఎం2 రీలోడెడ్ వర్షన్ వచ్చేసింది... ధర రూ.10,000 లోపే

    రియల్‌మీ 8 5జీ స్పెసిఫికేషన్స్
    డిస్‌ప్లే: 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్
    ర్యామ్: 4జీబీ, 8జీబీ
    ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ
    ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 700
    రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్ సాంసంగ్ జీఎం1 ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్
    ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
    బ్యాటరీ: 5000ఎంఏహెచ్ (18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్)
    ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ 2.0
    సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
    కలర్స్: సూపర్‌సోనిక్ బ్లూ, సూపర్‌సోనిక్ బ్లాక్
    ధర:
    4జీబీ+128జీబీ- రూ.14,999
    8జీబీ+128జీబీ- రూ.16,999

    గతంలో కూడా తక్కువ ధరకే 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన ఘనత కూడా రియల్‌మీదే. అంతకుముందు రియల్‌మీ నార్జో 30 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.16,999 ధరకే రిలీజ్ చేసింది. ఇప్పుడు అంతకన్నా తక్కువ ధరకే మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న రియల్‌మీ నార్జో 30 ప్రో, మోటో జీ 5జీ, ఎంఐ 10ఐ లాంటి మోడల్స్‌కి గట్టి పోటీ ఇవ్వనుంది.
    Published by:Santhosh Kumar S
    First published: