news18-telugu
Updated: January 15, 2020, 3:18 PM IST
Realme 5i: నాలుగు కెమెరాలతో రియల్మీ 5ఐ రిలీజ్... జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్
(image: Realme)
ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో
రియల్మీ దూకుడు కొనసాగిస్తోంది. వరుసగా స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తూ యూజర్లను కన్ఫ్యూజ్ చేస్తోంది. రియల్మీ 5 సిరీస్‌లో ఇప్పటికే
రియల్మీ 5 ప్రో,
రియల్మీ 5,
రియల్మీ 5ఎస్ రిలీజ్ చేసిన కంపెనీ... ఇప్పుడు బడ్జెట్ సెగ్మెంట్‌పై గురిపెట్టింది. తక్కువ ధరలో రియల్మీ 5ఐ రిలీజ్ చేసింది. షావోమీకి చెందిన రెడ్మీ 8 మోడల్‌ను టార్గెట్ చేస్తూ రియల్మీ 5ఐ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.8,999 మాత్రమే. ఈ ఫోన్ ఇప్పటికే వియత్నాంలో లాంఛైంది. ఇప్పుడు ఇండియాకు వచ్చింది. ఇండియాలో ఇవాళ (జనవరి 15న) మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో సేల్ మొదలయ్యింది. రిలయెన్స్ జియో యూజర్లకు రూ.7,550 విలువైన బెనిఫిట్స్ కల్పిస్తోంది. దాంతో పాటు క్యాషిఫై, మొబీక్విక్ నుంచి ఆఫర్స్ ఉన్నాయి.
రియల్మీ 5ఐ స్పెసిఫికేషన్స్
డిస్ప్లే: 6.52 అంగుళాలు
ర్యామ్: 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 665రియర్ కెమెరా: 12+8+2+2 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: కలర్ ఓఎస్ 6.0.1+ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: ఆక్వా బ్లూ, ఫారెస్ట్ గ్రీన్
ధర:
4జీబీ+64జీబీ- రూ.8,999
కుర్రాళ్ల కోసం సరికొత్త బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్ వచ్చేస్తోంది... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Realme: రియల్మీ ఫోన్లు వాడుతున్నవారికి షాకిచ్చిన కంపెనీ
Jio Wi-Fi Calling: మీ స్మార్ట్‌ఫోన్‌లో 'జియో వైఫై కాలింగ్' కోసం సెట్టింగ్స్ మార్చండి ఇలా
Paytm: పేటీఎం వాడుతున్నవారికి షాక్... ఈ ఛార్జీల గురించి తెలుసా?
SBI Account: ఈ ఒక్క అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఎన్నో లాభాలు... తెలుసుకోండి
Published by:
Santhosh Kumar S
First published:
January 15, 2020, 3:17 PM IST