Home /News /technology /

REALME LAUNCH OF THREE PRODUCTS FROM REALME BUDS AIR 3 BOOK PRIME SMART TV STICK PRICE FEATURES GH VB

Realme: రియల్‌మీ నుంచి మూడు ప్రొడక్ట్స్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 7న రియల్‌మీ (Realme) సంస్థ ఇండియాలో మెగా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3 (Realme Buds Air 3), రియల్‌మీ బుక్ ప్రైమ్ (Realme Book Prime), రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ (Realme Smart TV Stick) అనే మూడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది.

ఇంకా చదవండి ...
ఏప్రిల్ 7న రియల్‌మీ (Realme) సంస్థ ఇండియాలో మెగా ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3 (Realme Buds Air 3), రియల్‌మీ బుక్ ప్రైమ్ (Realme Book Prime), రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ (Realme Smart TV Stick) అనే మూడు కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. బడ్స్ ఎయిర్ ధర రూ.3,999, బుక్ ప్రైమ్ ధర రూ. 64,999, స్మార్ట్ టీవీ స్టిక్ ధరను రూ.2,999గా రియల్‌మీ నిర్ణయించింది. ఈ మూడు ప్రొడక్ట్స్ కూడా టెక్ ప్రియులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ బ్రాండ్ న్యూ ప్రొడక్ట్‌ల మెయిన్ ఫీచర్లు ఏవో ఇప్పుడు చూద్దాం.

* రియల్‌మీ బడ్స్ ఎయిర్ 3
42 డెసిబెల్స్ (42dB) వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, కస్టమైస్డ్ ఆటో ట్యూనింగ్‌, 88ms లేటెన్సితో గేమ్ మోడ్‌, 546ఎంఏహెచ్ బ్యాటరీతో బడ్స్ ఎయిర్ 3 వస్తుంది. క్వాలిటీ ప్రూఫ్ విషయంలో ఇది TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్‌ను పొందింది. ఇది 30 గంటల వరకు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆఫర్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జ్‌కి సపోర్ట్ చేసే ఈ బడ్స్ ని 100% ఛార్జ్ చేయడానికి ఒక గంట పడుతుంది. ఇది టచ్ కంట్రోల్‌లను కూడా కలిగి ఉంది. అలాగే ఇందులో ఇచ్చిన ట్రాన్స్‌పరెన్సీ మోడ్ అనేది ఇయర్‌బడ్స్ తీసివేయకుండా అవుట్‌సైడ్ సౌండ్స్ వినే ఫెసిలిటీని కల్పిస్తుంది. ఇందులో కాల్స్ కోసం డ్యూయల్ మైక్స్, వర్చువల్ అసిస్టెంట్‌లను అందించారు. Introductory సేల్ గా బడ్స్ ఎయిర్ 3ని రూ.3,499కే అందుబాటులోకి తీసుకొచ్చింది రియల్‌మీ. ఆ తర్వాత దీనిని రూ.3,999కి విక్రయిస్తుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్‌లలో మీరు దీనిని కొనుగోలు చేయొచ్చు. రిటైలర్‌ల వద్ద ఆఫ్‌లైన్‌లో కూడా కొనచ్చు.

OPPO Smart Phones: థార్డ్ పార్టీ కంపెనీల‌కు బైబై..మొబైల్ ప్రాసెస‌ర్‌ల‌పై ఒప్పో తాజా నిర్ణయం!

* రియల్‌మీ బుక్ ప్రైమ్
బుక్ ప్రైమ్ 3:2 స్క్రీన్ రేషియోతో 14-అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 2160 x 1440 రిజల్యూషన్, 400 నిట్‌ల పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ ఇంటెల్ 11వ Gen Core-i5 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఇంటెల్ ఎక్స్ఈ గ్రాఫిక్స్‌ను ఇందులో అందించారు. హర్మాన్ బ్రాండెడ్ స్టీరియో స్పీకర్లు, చాట్‌ల కోసం రెండు మైక్రోఫోన్‌లు, థండర్‌బోల్ట్ 4, Wi-Fi 6 సపోర్ట్, 65W ఛార్జర్‌తో ఇది వస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌ 30 నిమిషాల్లో 50% వరకు ఛార్జ్ అవుతుంది. పరిచయ ఆఫర్‌గా దీనిని రూ. 57,999కే విక్రయిస్తున్నారు. ఆ తర్వాత రూ.64,999కి ఇది సేల్ అవుతుంది. దీనిని ఏప్రిల్ 13 నుంచి రియల్‌మీ ఆన్‌లైన్ స్టోర్ లేదా ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.

* రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్
రియల్‌మీ స్మార్ట్ టీవీ స్టిక్ 60fps కంటెంట్, HDR 10+కి సపోర్ట్ చేస్తుంది. స్టిక్‌లో 1జీబీ ర్యామ్, క్వాడ్-కోర్ ARM కార్టెక్స్ A35 ప్రాసెసర్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ స్టిక్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత గూగుల్ ఆండ్రాయిడ్ టీవీని రన్ చేస్తుంది. ఇది అన్ని స్ట్రీమింగ్ యాప్‌లకు సపోర్ట్ చేస్తుంది. అలాగే గూగుల్ ప్లే సేవలకు యాక్సెస్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 2,999 కాగా రియల్‌మీ స్టోర్, ఫ్లిప్‌కార్ట్ సైట్స్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా రిటైలర్ల వద్ద ఆఫ్‌లైన్‌లో మీరు దీనిని కొనుగోలు చేయవచ్చు.
Published by:Veera Babu
First published:

Tags: Realme, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు