Realme C3: తక్కువ బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్... రేపే రియల్‌మీ సీ3 రిలీజ్

Realme C3 | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి మరో ఫోన్ రాబోతోంది. చైనాకు చెందిన రియల్‌మీ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్‌లో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేయనుంది.

news18-telugu
Updated: February 5, 2020, 3:33 PM IST
Realme C3: తక్కువ బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్... రేపే రియల్‌మీ సీ3 రిలీజ్
Realme C3: తక్కువ బడ్జెట్‌లో మరో స్మార్ట్‌ఫోన్... రేపే రియల్‌మీ సీ3 రిలీజ్ (image: Realme)
  • Share this:
రియల్‌మీ ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్. రియల్‌మీ నుంచి తక్కువ ధరలో మరో ఫోన్ వచ్చేస్తోంది. వచ్చే వారం రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కానుంది. ఇప్పటికే సీ సిరీస్‌లో రియల్‌మీ సీ1, రియల్‌మీ సీ2 స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అదే సిరీస్‌లో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది కంపెనీ. ఫిబ్రవరి 6న మధ్యాహ్నం 12.30 గంటలకు ఇండియాలో రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్‌ రిలీజ్ కానుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, వాటర్ డ్రాప్ నాచ్, డ్యూయెల్ కెమెరా సెటప్, 5,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఈ ఫోన్ ప్రత్యేకత. ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. రియల్‌మీ సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ, 4జీబీ+64జీబీ వేరియంట్లలో రిలీజ్ అవుతుంది.

రియల్‌మీ సీ3 స్పెసిఫికేషన్స్ (అంచనా)
డిస్‌ప్లే: 6.5 అంగుళాలు
ర్యామ్: 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64జీబీ
రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్ డ్యూయెల్ కెమెరా
బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో జీ70

ఇవి కూడా చదవండి:

Airtel: ఎయిర్‌టెల్ రూ.179 ప్లాన్‌తో రూ.2 లక్షల ఇన్స్యూరెన్స్

WhatsApp Dark Mode: వాట్సప్‌ డార్క్ మోడ్ కోసం సెట్టింగ్స్ ఇలా మార్చండి

Jio Plans: జియోలో ఎక్కువ డేటా కావాలా? రీఛార్జ్ ప్లాన్స్ ఇవే
First published: February 5, 2020, 3:33 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading