ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షావోమీ తర్వాత ఆ స్థాయిలో సంచలనాలు సృష్టించిన చైనీస్ కంపెనీ రియల్మీ. అందుకే ఇండియన్ మార్కెట్లో చాలా వేగంగా దూసుకొచ్చింది. ఇప్పుడు రియల్మీ మరో సంచలనం సృష్టించింది. కేవలం 20 నిమిషాల్లో స్మార్ట్‌ఫోన్‌ను 100 పర్సెంట్ ఛార్జ్ చేసే ఛార్జింగ్ సొల్యూషన్‌ను రూపొందించింది. 125వాట్ ఛార్జర్ ఇది. 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ సొల్యూషన్ పేరుతో ప్రపంచానికి పరిచయం చేసింది. గతంలో స్మార్ట్ఫోన్లకు 5వాట్ ఛార్జింగ్ ఉండేది. ఆ తర్వాత 10వాట్ ఛార్జర్లు వచ్చాయి. కొన్నాళ్లకు 18వాట్, 30వాట్ ఛార్జర్లకు డిమాండ్ పెరిగింది. ఎన్ని వాట్లు ఎక్కువగా ఉంటే స్మార్ట్‌ఫోన్ అంత వేగంగా 100 శాతం ఛార్జింగ్ అవుతుంది. అందుకే కంపెనీలు స్మార్ట్ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీ పెంచుతూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పెంచాయి. ఇప్పుడు రియల్మీ ఏకంగా 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ రూపొందించింది.
Flipkart offer: 32 అంగుళాల టీవీ రూ.7,999 మాత్రమే... ఎస్బీఐ కార్డుపై భారీ డిస్కౌంట్
WhatsApp: మీ వాట్సప్ నుంచి డబ్బులు పంపండి ఇలా
రియల్మీ 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జర్‌తో 4,000ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ గల 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 20 నిమిషాల్లో పూర్తిగా అంటే 100 శాతం ఛార్జింగ్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాదు... 33 శాతం ఛార్జింగ్ కోసం కేవలం 3 నిమిషాలు చాలని ప్రకటిస్తోంది. సామర్థ్యంతో పాటు సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని డైరెక్ట్ ఛార్జింగ్ విధానాన్ని రూపొందించామని, ఛార్జింగ్ ప్రమాదాలు నివారించేందుకు మల్టీ లేయర్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేశామని కంపెనీ చెబుతోంది. గేమ్స్ ఆడేప్పుడు, స్క్రీన్ ఆన్‌లో ఉన్నప్పుడు కూడా వేగంగా ఛార్జింగ్ సాధ్యమని చెబుతోంది. 5జీ స్మార్ట్ఫోన్లకు 125వాట్ అల్ట్రాడార్ట్ ఛార్జర్ ఉపయోగించడం ద్వారా బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుందని రియల్మీ అంటోంది.
కొద్ది రోజుల క్రితమే ఒప్పో కూడా 125వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని పరిచయం చేసింది. ఒప్పో 125వాట్ ఛార్జర్‌తో 4,000ఎంఏహెచ్ బ్యాటరీని 20 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ చేస్తే, 5 నిమిషాల్లో 41 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:July 17, 2020, 5:01 pm IST