రియల్మీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్. రియల్మీ 9 సిరీస్ (Realme 9 Series) స్మార్ట్ఫోన్లు రాబోతున్నాయి. త్వరలో ఇండియాలో రియల్మీ 9ఐ (Realme 9i) రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇదే స్మార్ట్‌ఫోన్‌ను భారతదేశంలో రిలీజ్ చేయబోతోంది రియల్మీ ఇండియా. ఇందుకు సంబంధించిన టీజర్‌ను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వియత్నాంలో రిలీజ్ అయిన ధరను భారతీయ కరెన్సీలోకి మారిస్తే సుమారు రూ.20,500 ధరతో రియల్మీ 9ఐ రిలీజ్ అయింది. గతేడాది ఇండియాలో రిలీజ్ అయిన రియల్మీ 8ఐ అప్‌గ్రేడ్ వర్షన్‌గా రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50మెగాపిక్సెల్ కెమెరా సెటప్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ లాంటి ప్రత్యేకతలున్నాయి.
రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఈ స్మార్ట్‌ఫోన్ వియత్నాంలో 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో రిలీజ్ అయింది. ఇండియాలో రెండు లేదా మూడు వేరియంట్లతో రిలీజ్ కావొచ్చు. ర్యామ్ ఎక్స్టెన్షన్ ఫీచర్‌తో 11జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డుతో 1టీబీ వరకు స్టోరేజ్ పెంచుకోవచ్చు.
Airtel 2GB Plans: రోజూ 2జీబీ డేటా కావాలా? ఎయిర్టెల్ లేటెస్ట్ ప్లాన్స్ ఇవే
This design looks amazing, don't you think?#StayTuned to know which Smartphone is coming next! pic.twitter.com/Pj71tmrghs
— realme (@realmeIndia) January 12, 2022
రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇండియాలో రిలీజ్ చేసిన వివో వై33టీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండటం విశేషం. ఒప్పో ఏ36 స్మార్ట్‌ఫోన్‌లో కూడా స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంది.
Vivo V23 Pro 5G: వివో వీ23 ప్రో 5జీ సేల్ ప్రారంభం... తొలి సేల్‌లోనే రూ.3,000 డిస్కౌంట్
రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్+ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో 50 మెగాపిక్సెల్ మోడ్, నైట్ షాట్, పనోరమా, ఎక్స్పర్ట్, టైమ్ ల్యాప్స్, పోర్ట్రైట్, స్లో మోషన్, టెక్స్ట్, సూపర్ క్లోజ్ అప్, హెచ్డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
రియల్మీ 9ఐ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో నైట్ షాట్, పనోరమా, టైమ్ ల్యాప్స్, పోర్ట్రైట్, ఏఐ బ్యూటీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + రియల్మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను గ్రీన్ క్వార్ట్జ్, బ్లాక్ క్వార్ట్జ్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone