Realme GT Master Edition: ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్... ఎందుకంత క్రేజ్?

Realme GT Master Edition: ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కు విపరీతమైన డిమాండ్... ఎందుకంత క్రేజ్? (image: Realme India)

Realme GT Master Edition | రియల్‌మీ ఇటీవల రిలీజ్ చేసిన రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌కు ఫెస్టివల్ సేల్‌లో ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి.

  • Share this:
    రియల్‌మీ ఫెస్టీవ్ డేస్ సేల్‌లో (Realme Festive Days) మీరు స్మార్ట్‌ఫోన్ కొన్నారా? కొత్త మొబైల్ కొంటున్నారా? ఈ సేల్‌లో రియల్‌మీకి చెందిన అన్ని స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని మొబైల్స్‌కి క్రేజ్ ఎక్కువగా కనిపిస్తోంది. అలాంటి మొబైల్స్‌లో ఒకటి రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ (Realme GT Master Edition). రియల్‌మీ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన స్మార్ట్‌ఫోన్ ఇది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఎక్కువగా అమ్ముడుపోతున్న స్మార్ట్‌ఫోన్లలో ఇది కూడా ఒకటి. సేల్ మొదలైన మొదటి మూడు రోజుల్లోనే 10 లక్షలకు పైగా రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లు అమ్మినట్టు రియల్‌మీ అధికారికంగా ప్రకటించింది.


    రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.25,999. ఇది 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.27,999 కాగా, 8జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ.29,999. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొంటే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.

    Amazon Offers: 15,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? అమెజాన్ సేల్‌లో బెస్ట్ 10 మొబైల్స్ ఇవే

    రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ వొయెగర్ గ్రే, ల్యూన్ వైట్, కాస్మోస్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. వీటిలో వొయెగర్ గ్రే కలర్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్ వినూత్నంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు సూట్‌కేస్ డిజైన్ లాగా కనిపిస్తుంది. డిజైన్ కొత్తగా ఉండటంతో ఈ స్మార్ట్‌ఫోన్ కొనేందుకు యూజర్లు ఆసక్తి చూపిస్తున్నారు. వొయెగర్ గ్రే కలర్ 6జీబీ+128జీబీ వేరియంట్ అందుబాటులో లేదు. ఈ కలర్ మొబైల్ కొనాలంటే 8జీబీ+128జీబీ లేదా 8జీబీ+256జీబీ వేరియంట్‌లో కొనాలి.

    Washing Machine Offers: అమెజాన్‌లో రూ.5,000 ధరకే వాషింగ్ మెషీన్... ఆఫర్స్ ఇవే

    రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో ర్యామ్ 5జీబీ వరకు పెంచుకోవచ్చు. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. వెనుకవైపు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో మూడు కెమెరాలున్నాయి. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: