Video: షాక్... 13,000 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన రియల్‌మీ సీఈఓ

Realme Dare To Leap Challenge | #DareToLeap ఛాలెంజ్ పేరుతో చాలాకాలంగా రియల్‌మీ తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను ప్రచారం చేస్తోంది. ఇప్పుడు సీఈఓ మాధవ్ షేఠ్ సాహసాన్ని కూడా #DareToLeap పేరుతో రియల్‌మీ ప్రమోషన్ చేస్తోంది.

news18-telugu
Updated: September 10, 2019, 3:27 PM IST
Video: షాక్... 13,000 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన రియల్‌మీ సీఈఓ
Video: షాక్... 13,000 అడుగుల ఎత్తు నుంచి దూకేసిన రియల్‌మీ సీఈఓ (image: Realme India)
news18-telugu
Updated: September 10, 2019, 3:27 PM IST
దూకేస్తా... దూకేస్తా... అంటూ కొంతకాలంగా ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌కు ఛాలెంజ్ విసురుతున్న రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ షేఠ్... ఏకంగా 13,000 ఎత్తు నుంచి కిందకు దూకేశారు. త్వరలో తాను స్కై డైవింగ్ చేయబోతున్నట్టు కొంతకాలం క్రితమే ప్రకటించారాయన. రియల్‌మీ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ 1,30,000 పైగా యూనిట్స్ అమ్మినందుకు ఆకాశంలో 13,000 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేశారు. 10 రియల్‌మీ 5 ప్రో యూనిట్స్‌కు 1 ఫీట్ చొప్పున లెక్కించి మరీ 13,000 ఎత్తు నుంచి కిందకు దూకారు రియల్‌మీ ఇండియా సీఈఓ మాధవ్ షేఠ్. ఆ వీడియోను రియల్‌మీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. ఆ వీడియో ఇక్కడ చూడండి.

#DareToLeap ఛాలెంజ్ పేరుతో చాలాకాలంగా రియల్‌మీ తమ బ్రాండ్ స్మార్ట్‌ఫోన్లను ప్రచారం చేస్తోంది. ఇప్పుడు సీఈఓ మాధవ్ షేఠ్ సాహసాన్ని కూడా #DareToLeap పేరుతో రియల్‌మీ ప్రమోషన్ చేస్తోంది. చైనాకు చెందిన స్మార్ట్‌‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ గతేడాది ఇండియాలో అడుగుపెట్టింది. భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఇది. మరో చైనా కంపెనీ అయిన షావోమీకి గట్టి పోటీ ఇస్తోంది.

Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

'Joker' Malware: 24 యాప్స్‌లో 'జోకర్' మాల్‌వేర్... మీ ఫోన్‌లో ఉంటే వెంటనే డిలిట్ చేయండి
Loading...
Camera Tips: ఫోటోలు బాగా రావాలా? స్మార్ట్‌ఫోన్‌ కెమెరా ఎంత ఉండాలో తెలుసుకోండి

JioFiber: రూ.699 నుంచి జియోఫైబర్ ప్లాన్స్... బెనిఫిట్స్ ఇవే
First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...