Realme: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి... ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే

Realme: రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగాయి... ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే (image: Realme India)

Realme | రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ (Realme Smartphone) కొనాలనుకునేవారికి షాక్. ఐదు మోడల్స్‌ ధరను రూ.1,500 వరకు పెంచింది రియల్‌మీ. లేటెస్ట్ ధరలు తెలుసుకోండి.

  • Share this:
    మీరు రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీరు అనుకున్న బడ్జెట్ కన్నా కాస్త ఎక్కువ చెల్లించాలి. రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల (Realme Smartphone) ధరలు పెరిగాయి. ఇటీవల షావోమీ స్మార్ట్‌ఫోన్ల (Smartphone) ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. రెడ్‌మీ నోట్ 10 (Redmi Note 10) ధరను పెంచింది షావోమీ. ఇప్పుడు రియల్‌మీ కూడా అదే దారిలో నడుస్తోంది. ఏకంగా 5 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని పెంచింది. రియల్‌మీ 8 (Realme 8), రియల్‌మీ 8 5జీ (Realme 8 5జీ), రియల్‌మీ సీ11 2021 (Realme C11 2021), రియల్‌మీ సీ21 (Realme C21), రియల్‌మీ సీ25ఎస్ (Realme C25s) మోడల్స్ ధరల్ని పెంచింది కంపెనీ. వీటిపై ఏకంగా రూ.300 నుంచి రూ.1,500 మధ్య ధర పెరిగింది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ధరలు కనిపిస్తున్నాయి. మరి ఏఏ మోడల్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసుకోండి.

    Realme 8: రియల్‌మీ 8 స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.14,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.15,999. ఇక ఇదే స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.15,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.16,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర గతంలో రూ.16,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.17,999. ఈ మూడు మోడల్స్‌పై ఏకంగా రూ.1,500 ధర పెంచింది రియల్‌మీ.

    Redmi Note 10 Pro Max: రూ.19,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.4,999 ధరకే కొనండి

    Realme 8 5G: రియల్‌మీ 8 5జీ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.13,999 ఉండేది. ప్రస్తుత ధర రూ.15,499. రియల్‌మీ 8 5జీ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.14,999 ఉండేది. ప్రస్తుత ధర రూ.16,499. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర గతంలో రూ.16,999 ఉండేది. ప్రస్తుత ధర రూ.18,499. ఈ మూడు మోడల్స్ పైనా రూ.1,500 ధర పెంచింది రియల్‌మీ.

    Realme C11: రియల్‌మీ సీ11 స్మార్ట్‌ఫోన్ 2జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.6,999 ఉండేది. ప్రస్తుత ధర రూ.7,299. ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.8,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.8,799. రియల్‌మీ సీ11 ధర రూ.300 పెరిగింది.

    Samsung Galaxy A52s 5G: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర ఎంతంటే

    Realme C21: రియల్‌మీ సీ21 స్మార్ట్‌ఫోన్ 3జీబీ ర్యామ్ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.8,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.8,999. ఇక 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.9,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.9,999. రియల్‌మీ సీ21 ధర రూ.500 పెరిగింది.

    Realme C25s: రియల్‌మీ సీ25ఎస్ స్మార్ట్‌ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.10,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.10,999. ఇక 4జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర గతంలో రూ.11,499 ఉండేది. ప్రస్తుత ధర రూ.11,999. రియల్‌మీ సీ25 ధర రూ.500 పెరిగింది.
    Published by:Santhosh Kumar S
    First published: