స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మీ (Realme) ఇండియన్ మార్కెట్‌లో బెస్ట్ సేల్స్‌తో దూసుపోతుంది. ఈ క్రమంలో స్మార్ట్ వాచ్‌లు, ఆడియో ప్రొడక్ట్స్‌తో పాటు స్మార్ట్ టీవీలపై కూడా కంపెనీ దృష్టి సారించింది. రియల్‌మీ తాజాగా ఇండియన్ మార్కెట్‌లో రియల్‌మీ స్మార్ట్ టీవీ ఎక్స్ (Realme Smart TV X) పేరుతో కొత్త స్మార్ట్ TV మోడల్‌ను లాంచ్ చేసింది. ఇది 40-అంగుళాలు, 43-అంగుళాల సైజుల్లో లభిస్తుంది. ఈ మోడళ్లు ఫుల్-HD రిజల్యూషన్‌ను అందిస్తాయి. రియల్‌మీ స్మార్ట్ టీవీ X డిజైన్ ఆకట్టుకునేలా ఉంది. రియల్‌బీ బ్రాండింగ్‌తో కూడిన చిన్న స్పాట్ దీనిపై ఉంది. ఈ స్మార్ట్ టీవీతో పాటు కంపెనీ రియల్‌మీ ప్యాడ్ మినీ టాబ్లెట్, రియల్‌మీ బడ్స్ Q2s, రియల్‌మీ GT నియో 3 150W స్మార్ట్‌ఫోన్ ఎడిషన్‌లను కూడా లాంచ్ చేసింది. రియల్‌మీ GT నియో 3.. 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
* రియల్‌మీ స్మార్ట్ TV X ధర
భారతదేశంలో రియల్‌మీ TV X బేస్ 40-అంగుళాల స్క్రీన్ వేరియంట్ ధర రూ. 22,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే 43-అంగుళాల మోడల్ ధర రూ. 25,999. బేస్ వేరియంట్ సేల్స్ మే 4న రియల్‌మీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఛానెల్స్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభమవుతాయి. టాప్-మోడల్ సేల్ మే 5 నుంచి ఇవే ఛానెల్స్ ద్వారా ప్రారంభమవుతాయి. రియల్‌మీ ఇ-స్టోర్‌లో ఇంట్రడ్యూసరీ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ రెండు వేరియంట్లపై ప్రస్తుతం రూ.1,000 డిస్కౌంట్ ఉంది.
* రియల్‌మీ స్మార్ట్ టీవీ X స్పెసిఫికేషన్స్
రియల్‌మీ స్మార్ట్ TV X ఏడు డిస్‌ప్లే మోడ్‌లతో లభిస్తుంది. స్టాండర్డ్, వివిడ్, స్పోర్ట్, మూవీ, గేమ్, ఎనర్జీ సేవింగ్, యూజర్ మోడ్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. దీని స్క్రీన్ 400 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. క్రోమా బూస్ట్ టెక్నాలజీ పిక్చర్ క్వాలిటీ, రంగులను పెంచుతుంది. 3D ఆడియో అవుట్‌పుట్‌కు సపోర్ట్ చేసే 24W డాల్బీ ఆడియో స్టీరియో స్పీకర్స్ బెస్ట్ సౌండ్ క్వాలిటీని అందిస్తాయి.
హాట్‌కీస్ ఉన్న రిమోట్..
రియల్‌మీ స్మార్ట్ TV X.. 1GB RAM, 8GB స్టోరేజ్‌తో జత చేసిన 64-బిట్ మీడియాటెక్ క్వాడ్-కోర్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 11 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌పై రన్ అవుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, యూట్యూబ్, గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కోసం హాట్‌కీస్ (Hot keys) ఉన్న రిమోట్‌తో టీవీని డిజైన్ చేశారు. ఇది ఆండ్రాయిడ్ ఓఎస్‌తో పని చేస్తున్నందువల్ల, యూజర్లు గూగుల్ ప్లే యాప్ స్టోర్ (Google Play App store) నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించవచ్చు. ఈ డివైజ్ ఒక సంవత్సరం ఫుల్ వారంటీ, రెండు సంవత్సరాల స్క్రీన్ వారంటీతో వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Realme, Smart TV