Home /News /technology /

ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన Realme.. ఇంత మోసమా? అసలేం జరిగిందంటే..

ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన Realme.. ఇంత మోసమా? అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ వినియోగదారులను మోసం చేసేందుకు యత్నించి అడ్డంగా దొరికింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    మార్కెట్లో మంచి పట్టు పెంచుకోవాలన్న టార్గెట్ తో అడుగులు వేస్తున్న చైనీస్ మొబైల్ కంపెనీ రియల్మీ అడ్డంగా బుక్కైంది. తక్కువ ధరతో ఐఫోన్ కు పోటీగా పని చేస్తామని చెప్పడం కోసం ప్రయత్నించి ఆన్లైన్లో అడ్డంగా దొరికిపోయింది రియల్ మీ. దీంతో కంపెనీ నెటిజన్ల ముందు నవ్వుల పాలవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో రియల్మీ నార్జో 30ఏ మొబైల్ ను లాంచ్ చేసింది. ఈ ఈవెంట్లో రియల్మీ తమ మొబైల్‌లో గేమ్స్ స్ట్రీమింగ్‌ అయ్యే విధానాన్ని పెద్ద స్క్రీన్‌పై చూపించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడే కంపెనీ అడ్డంగా దొరికిపోయింది. ఇందు కోసం తన రియల్మీ ఫోన్ కాకుండా ఐఫోన్ వాడుతూ దొరికిపోయింది కంపెనీ.

    గేమ్స్ స్ట్రీమింగ్ విధానాన్ని లైవ్ లో చూపడం కోసం ముగ్గురు స్ట్రీమర్లను పిలిపించి వారికి మొబైల్స్ ఇచ్చి పబ్‌జీ ఆడించింది రియల్మీ. వారు ఆడుతున్న గేమ్‌ను వెనక పెద్ద తెరపై ప్రసారం చేసింది. ఆ సమయంలో స్క్రీన్ మీద Guided Access పాపప్ కనిపించింది. అయితే ఈ గైడెడ్ యాక్సెస్ కేవలం ఐఫోన్లకు మాత్రమే అందించే ఎక్స్‌క్లూజివ్ ఫీచర్. ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్లు రియల్మీని ఆటాడేసుకుంటున్నారు.

    ఇదిలా ఉంటే.. ప్రముఖ ప్రీమియం స్మార్ట్​ఫోన్​ బ్రాండ్​ వన్​ప్లస్​ స్మార్ట్​ఫోన్​ ప్రియులకు గుడ్​ న్యూస్​ తెలిపింది. వన్‌ప్లస్ 9 సిరీస్‌లో వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌ అనే మూడు కొత్త స్మార్ట్​ఫోన్లను లాంఛ్​ చేసింది. ఈ మూడు ఫోన్‌లలో దాదాపు ఒకే రకమైన ఇంటర్‌ఫేస్ కోసం ఆక్సిజన్ ఓఎస్‌, ఆండ్రాయిడ్ 11లను అందించింది. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్​లోని హార్డ్‌వేర్‌లలో చాలా తేడాలు ఉన్నాయి. వన్‌ప్లస్ 9 ఆర్‌తో పోలిస్తే వన్‌ప్లస్ 9 ప్రోలో మరిన్ని అడ్వాన్సుడ్​ ఫీచర్లను చేర్చింది. ఈ మూడు వేరియంట్లలోనూ 5 జి సపోర్ట్​ను అందించడం విశేషం.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Iphone, Realme, Realme Narzo

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు