Home /News /technology /

REALME HAS ADDED A NEW MID RANGE 5G SMARTPHONE TO ITS LINEUP WITH THE LAUNCH OF THE REALME 9I 5G AND HERE FEATURES PRICE YOU SHOULD LOOK IT GH SRD

Realme 9i 5G: అదిరే ఫీచర్లతో రియల్‌మీ నుంచి కొత్త మిడ్‌రేంజ్ ఫోన్ లాంచ్.. ధర అందుబాటులోనే..

Realme 9i 5G

Realme 9i 5G

ఇండియన్‌ మార్కెట్లో మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో వివిధ కంపెనీల మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లకు దీటుగా రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రీసెంట్‌గా మిడ్‌ రేంజ్‌ లైనప్‌లో కొత్త రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ ఫోన్‌ను తీసుకొచ్చ?

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
స్మార్ట్ బ్రాండ్ రియల్‌మీ (Realme) బడ్జెట్, ఫ్లాగ్‌షిప్, మిడ్‌రేంజ్ వంటి అన్ని విభాగాలలోనూ కొత్త స్మార్ట్‌ఫోన్ (New Smartphones)ను రిలీజ్ చేస్తోంది. ఇండియన్‌ మార్కెట్లో(Indian Market) మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ సెగ్మెంట్‌లో వివిధ కంపెనీల మిడ్‌ రేంజ్‌ ఫోన్‌లకు దీటుగా రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రీసెంట్‌గా మిడ్‌ రేంజ్‌ లైనప్‌లో కొత్త రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ ఫోన్‌(Realme 9i 5G)ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఫుల్‌ HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఇది మొబైల్‌ ఇండస్ట్రీలో MET గాలా 2022 థీమ్ ఇన్‌స్పిరేషన్‌ వింటేజ్‌ CD డిజైన్‌తో రూపొందిన మొదటి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. రియల్‌మీ 9i 5G ఫోన్ ట్రూ యూనికోవర్ మెథడ్‌ను ఉపయోగిస్తుంది. కెమెరా వెనుక భాగం మరింత సురక్షితంగా ఫిట్‌ అయ్యేలా చేస్తుంది.

* ధర ఎంత?
రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌ రెండు వేరియంట్‌లలో వస్తుంది. 4GB+64GB, 6GB+ 28GB వేరియంట్‌ ధరలు వరుసగా రూ.14,999, రూ.16,999గా ఉన్నాయి. సోల్‌ఫుల్ బ్లూ, రాకింగ్ బ్లాక్, మెటాలికా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. రియల్‌మీ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ Realme.com, ఈకామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 24 నుంచి ఈ ఫోన్ సేల్స్ ప్రారంభమవుతాయి. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా రియల్‌మీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై రూ.1,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

* స్పెసిఫికేషన్స్
రియల్‌మీ 9i 5G స్మార్ట్‌ఫోన్‌ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 810 చిప్‌సెట్‌, గరిష్టంగా 6GB RAMతో వస్తోంది. స్మార్ట్‌ఫోన్ 6GB వరకు వర్చువల్ RAM సపోర్ట్‌ను కూడా అందిస్తుంది. రియల్‌మీ 9i 5G ఫోన్‌ 64GB, 128GB రెండు స్టోరేజ్ ఆప్షన్‌లలో వస్తుంది. మైక్రో SD కార్డ్‌ ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ 5G స్మార్ట్‌ఫోన్ 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్‌ HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి : ఇండియాలో కొత్త ఇయర్ బడ్స్ లాంచ్.. ధర రూ. 999 మాత్రమే.. ప్రత్యేకతలు ఇవే..

డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌, కంపెనీ ఓన్‌ లేయర్ రియల్‌మీ UI ఆన్‌ టాప్‌పై రన్‌ అవుతుంది. రియల్‌మీ 9i 5G ఫోన్‌ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఇందులో f/1.8 ఎపర్చరు, LED ఫ్లాష్, 2MP B&W, 2MP మాక్రో సెన్సార్‌, f/2.4 ఎపర్చరుతో 50MP మెయిన్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో f/2.0 ఎపర్చర్‌తో 8MP సెల్ఫీ షూటర్ ఉంది. స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000mAh బ్యాటరీని అందిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

Tags: 5G Smartphone, Realme, Smart phones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు