Realme GT 2 Pro | రియల్మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) పేరుతో సరికొత్త డివైజ్‌ను కంపెనీ భారత్‌లో లాంచ్ చేసింది.
రియల్మీ (Realme) నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది. రియల్మీ జీటీ 2 ప్రో (Realme GT 2 Pro) పేరుతో సరికొత్త డివైజ్‌ను కంపెనీ భారత్‌లో లాంచ్ చేసింది. ఈ మోడల్ ఐక్యూ 9 ప్రో (iQoo 9 Pro), వన్‌ప్లస్ 10 ప్రో (OnePlus 10 Pro), శామ్సంగ్ గెలాక్సీ ఎస్22 (Galaxy S22) లైనప్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పోటీ పడనుంది. ఈ కొత్త ఫ్లాగ్షిప్ కస్టమర్లను ఆకట్టుకుంటుందని రియల్మీ ప్రకటించింది. బెస్ట్ పర్ఫార్మెన్స్ డివైజ్ కోసం చూసే గేమింగ్ లవర్స్‌ను దృష్టిలో పెట్టుకొని కొత్త ఫోన్‌కు కంపెనీ డిజైన్ చేసింది.
కొత్త GT 2 ప్రో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్తో పనిచేస్తుంది. తక్కువ ధరలో ఈ చిప్‌సెట్‌ను అందించే చౌకైన స్మార్ట్‌ఫోన్‌గా GT 2 ప్రో నిలుస్తోంది. ఈ ఫోన్ ద్వారా గేమ్స్‌ను సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఫోన్ హీట్ కాకుండా ఈ సెగ్మెంట్లో లార్జ్ కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసినట్లు కంపెనీ పేర్కొంది.
రియల్మీ GT 2 ప్రో ధర రియల్మీ GT 2 ప్రో వివిధ వేరియంట్లలో లభిస్తుంది. 8GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 44,999 గా ఉంది. 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ.52,999గా నిర్దేశించింది. ఇవి ప్రారంభ ధరలు మాత్రమే. ఇతర ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చేనాటికి ఈ రెండు డివైజ్‌ల ధరలు రూ. 5000 వరకు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
స్పెసిఫికేషన్లు
రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్ ట్రిపుల్ లెన్స్ సెటప్‌తో వస్తుంది. డే లైట్, లో-లైట్ ఇమేజ్‌లను క్వాలిటీతో క్యాప్చర్ చేయగలదు. దీని ట్రిపుల్ లెన్స్ సెటప్‌లో IMX766 సోనీ సెన్సార్‌ను ఉపయోగించే ఒక 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఉంది. ఫోన్లో రెండవ కెమెరా మాడ్యూల్ కూడా ఉంది. ఇది 50-మెగాపిక్సెల్ యూనిట్. ఈ మాడ్యూల్ 150-డిగ్రీ ఫీల్డ్ విజన్‌కు సపోర్ట్ చేసే అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్. మూడవ లెన్స్ 40X మైక్రో లెన్స్. ఇది డివైజ్‌లో కొత్త 'మైక్రోస్కోప్' కెమెరా ఫీచర్‌ను ఎనేబుల్ చేయగలదు.
ఈ ప్రీమియం ఫ్లాగ్షిప్ ఫోన్ డిజైన్ పరంగా కంపెనీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. Realme GT 2 Pro స్పెషల్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుంది. ఫోన్ “పేపర్ టెక్ మాస్టర్ డిజైన్”తో, క్వాలిటీ మెటీరియల్‌తో భిన్నమైన ఇన్-హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. రియల్మీ GT 2 ప్రో 5000mAh బ్యాటరీతో వస్తుంది.
ఈ బ్యాటరీ ప్యాక్ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. దీని బ్యాటరీ లైఫ్ మీకు ఒక రోజు మొత్తానికి సరిపోతుంది. ఈ డివైజ్ ఫ్లాగ్షిప్-గ్రేడ్ LTPO2 AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే 2K రిజల్యూషన్‌తో వచ్చినందున క్రిస్ప్‌గా కనిపిస్తోంది. డిఫాల్ట్‌గా రిజల్యూషన్ FullHD+కి సెట్ చేసి ఉంటుంది. బ్యాటరీ ఆదా చేసేందుకు డిస్ప్లే రిఫ్రెష్ రేట్లను 1Hz నుంచి 120hz వరకు మారుస్తుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.