Realme GT Neo 5 Features | మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు శుభవార్త. అదిరిపోయే ఫోన్ మార్కెటలోకి రాబోతోంది. పవర్ఫుల్ స్పెసిఫికేషన్స్‌తో రియల్‌మి (Realme) కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఈ కొత్త అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. మునుపెన్నడూ లేని ఫీచర్లతో రియల్‌మి ఈ కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుందని తెలుస్తోంది.
రియల్‌మి త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్న స్మార్ట్‌పోన్ రియల్‌మి జీటీ నియో 5. ఈ ఫోన్ ఫీచర్లు ఇప్పుడు లీక్ అయ్యాయి. ఇందులో అదిరిపోయే బ్యాటరీ స్పీడ్ ఉండనుందని తెలుస్తోంది. కంపెనీ సెప్టెంబర్ 8న రియల్‌మి 10 ప్రో ప్లస్ ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అలాగే నియో సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను ఆవిష్కరించనుందని తెలుస్తోంది.
రూ.12,750 కూలర్ రూ.3,500కే.. అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్!
రియల్‌మి జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ ఈ ఏడాది మార్చి నెలలో మార్కెట్లోకి వచ్చింది. రియల్‌మి జీటీ నియో 5 ఫోన్‌ను ఈ సీరిస్‌లోనే తీసుకువచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ కింద మార్కెట్లోకి వచ్చిన రెండు ఫోన్లలో 150 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉంది. 50 శాతం బ్యాటరీ 5 నిమిషాల్లో, 100 శాతం బ్యాటరీ 15 నిమిషాల్లో ఫుల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఇక ఇప్పుడు వచ్చే నియో 5 ఫోన్లో ఇంతకు మించి ఫీచర్ల ఉండనున్నాయని తెలుస్తోంది.
అదిరే ఆఫర్.. వాషింగ్ మెషీన్‌పై 50 శాతం డిస్కౌంట్, నెలకు రూ.600 చెల్లిస్తే చాలు!
ఫోన్ఎరీనా ప్రకారం చూస్తే.. రియల్‌మి జీటీ నియో 5 స్మార్ట్‌ఫోన్ 2023 తొలి త్రైమాసికంలో మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌లో వచ్చే స్మార్ట్‌ఫోన్స్‌లో సోనీ ఐఎంఎక్స్890 సెన్సార్, ఓఐఎస్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉండొచ్చు. అలాగే రెండు మోడళ్లు తయారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దారిలో 5 వేల ఎంఏహెచ్ బ్యాటరీ, మరో దానిలో 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండొచ్చు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లో 150 వాట్ చార్జింగ్ స్పీడ్ ఉండే ఛాన్స్ ఉంది. అలాగే 4600 ఎంఏహెచ్ బ్యాటరీ ఫోన్లో 240వాట్ చార్జింగ్ స్పీడ్ ఉండొచ్చు. అంటే 240 వాట్ చార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదే కానుంది.
ఒప్పొ ఇప్పటికే 240 వాట్ సూపర్ వూక్ ఫ్లష్ చార్జ్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022లో ఆవిష్కరించింది. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ కేవలం 9 నిమిషాల్లోనే ఫుల్ అయ్యింది. కేవలం ఒప్పొ మాత్రమే కాకుండా ఐకూ కూడా 200 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను తీసుకువస్తోంది. ఐకూ 10 ప్రో ఫోన్లో ఈ ఫీచర్ ఉండొచ్చు. ఐకూ 11 ప్రో ఫోన్లో కూడా ఫీచర్ ఉండొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, New smartphone, Realme, Realme gt