హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది

Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది

Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది
(image: Realme India)

Realme GT Neo 3T: సర్‌ప్రైజ్ ఆఫర్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ వచ్చేసింది (image: Realme India)

Realme GT Neo 3T | ఇండియాలో రియల్‌మీ జీటీ నియో 3టీ రిలీజ్ అయింది. రియల్‌మీ జీటీ నియో 3టీ ధర (Realme GT Neo 3T Price) ఎంత ఉంటుందా అని ఎదురుచూసినవారికి సర్‌ప్రైజ్ ఇచ్చింది రియల్‌మీ.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T) ఇండియాకు వచ్చేసింది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్‌లో రిలీజైన ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ ముందే తెలుసు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్, 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. రియల్‌మీ ఫ్యాన్స్ ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూశారు. వారికి ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చింది రియల్‌మీ. ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ప్రకటించడమే కాకుండా, భారీ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో ధరల్ని బట్టి రియల్‌మీ జీటీ నియో 3టీ ధర రూ.30,000 పైనే ఉంటుందని అంచనా వేశారు. కానీ ఈ మొబైల్‌ను రూ.30,000 లోపు సెగ్మెంట్‌లో (Smartphone Under Rs 30,000) రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది రియల్‌మీ. అంతేకాదు. ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ కూడా ప్రకటించింది.

రియల్‌మీ జీటీ నియో 3టీ ధర, ఆఫర్స్

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజైంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999. సెప్టెంబర్ 23న సేల్ ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో కొనేవారికి ఏకంగా రూ.7,000 తగ్గింపు లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ కార్డుతో కొనేవారికి ఆఫర్స్ లభిస్తాయి. రూ.7,000 డిస్కౌంట్‌తో రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.22,999 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.26,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

Big Billion Offer: ఈ 6 షావోమీ స్మార్ట్‌ఫోన్లపై రూ.7,000 వరకు డిస్కౌంట్

రియల్‌మీ జీటీ నియో 3టీ స్పెసిఫికేషన్స్

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఈ4 అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ పోకో ఎఫ్4, ఐకూ నియో6, రియల్‌మీ జీటీ నియో2 లాంటి మొబైల్స్‌లో ఉంది. ఆండ్రాయిడ్ 12 + రియల్‌మీ యూఐ 3.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్ ఉంది. ఈ ఫీచర్‌తో అదనంగా 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు.

Xiaomi 11i HyperCharge: ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయిన డిస్కౌంట్... బిగ్ బిలియన్ ఆఫర్ వివరాలివే

రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. రియల్‌మీ జీటీ నియో 3టీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్ డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 12 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. డ్రిఫ్టింగ్ వైట్, డ్యాష్ ఎల్లో, షేడ్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Flipkart Big Billion Days, Realme, Realme gt, Smartphone

ఉత్తమ కథలు