Home /News /technology /

REALME GT NEO 3 SMARTPHONE LAUNCHED IN INDIA WITH DIMENSITY 8100 PROCESSOR AND 150W ULTRADART FAST CHARGING SUPPORT KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme GT Neo 3: 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్... రియల్‌మీ జీటీ నియో 3 ఇండియాకు వచ్చేసింది

Realme GT Neo 3: 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్... రియల్‌మీ జీటీ నియో 3 ఇండియాకు వచ్చేసింది
(image: Realme India)

Realme GT Neo 3: 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్... రియల్‌మీ జీటీ నియో 3 ఇండియాకు వచ్చేసింది (image: Realme India)

Realme GT Neo 3 | రియల్‌మీ నుంచి పాపులర్ అయిన జీటీ సిరీస్‌లో (Realme GT Series) రియల్‌మీ జీటీ నియో 3 ఇండియాకు వచ్చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‍ను కేవలం 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు.

ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి అలర్ట్. రియల్‌మీ జీటీ సిరీస్‌లో (Realme GT Series) మరో మొబైల్ రిలీజైంది. రియల్‌మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) మోడల్‌ను రిలీజ్ చేసింది కంపెనీ. మిడ్‌రేంజ్, ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ బాగా పాపులర్ అయ్యాయి. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్‌మీ జీటీ, రియల్‌మీ జీటీ నియో 2, రియల్‌మీ జీటీ 2, రియల్‌మీ జీటీ 2 ప్రో లాంటి మోడల్స్ ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు ఫ్లాగ్‌షిప్ ఫీచర్స్‌తో రియల్‌మీ జీటీ నియో 3 వచ్చేసింది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8100 ప్రాసెసర్, 150వాట్ అల్‌ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ జీటీ నియో 3 రెండు మోడల్స్ రిలీజ్ అయ్యాయి. 5,000ఎంఏహెచ్ బ్యాటరీకి 80వాట్ సూపర్‌డార్ట్ సపోర్ట్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న స్మార్ట్‌ఫోన్‌కు 150వాట్ అల్‌ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది.

రియల్‌మీ జీటీ నియో 3 ధర


రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ మొత్తం మూడు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ ధర రూ.36,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.38,999. ఇక 150వాట్ అల్‌ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించే 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.42,999. ఆస్ఫాల్ట్ బ్లాక్, నిట్రో బ్లూ, స్ప్రింట్ వైట్ కలర్స్‌లో కొనొచ్చు. మే 4న సేల్ ప్రారంభం అవుతుంది. ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ స్టోర్స్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనొచ్చు.

Poco M4 5G: పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... రూ15,000 లోపే 6GB+128GB మొబైల్


రియల్‌మీ జీటీ నియో 3 స్పెసిఫికేషన్స్


రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ లేటెస్ట్‌గా ఇండియాలో రిలీజైన వన్‌ప్లస్ 10ఆర్ మోడల్‌లో కూడా ఉంది. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది.

OnePlus: వన్‌ప్లస్ సంచలనం... తొలిసారి రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రిలీజ్

రియల్‌మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

బ్యాటరీ విషయానికి వస్తే రియల్‌మీ జీటీ నియో 3 రెండు ఛార్జింగ్ వేరియంట్లలో లభిస్తుంది. 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 8జీబీ+128జీబీ, 12జీబీ+128జీబీ వేరియంట్లకు 80వాట్ సూపర్‌డార్ట్ సపోర్ట్ లభిస్తుంది. 32నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయొచ్చు. ఇక 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న 12జీబీ+256జీబీ వేరియంట్‌కు 150వాట్ అల్‌ట్రాడార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone

తదుపరి వార్తలు