Realme GT Neo 3 | స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో దూకుడుమీదున్న రియల్మీ మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 22న చైనాలో విడుదల చేయనుంది.
స్మార్ట్‌ఫోన్ (Smart Phone) మార్కెట్లో దూకుడుమీదున్న రియల్మీ మరో ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ డేట్‌ను ఫిక్స్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 22న చైనాలో విడుదల చేయనుంది. మార్కెట్లో 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల మొట్టమొదటి ఫోన్ ఇదే కావడం విశేషం. గత నెలలో బార్సిలోనాలో జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2022 (MWC 2022)లో రియల్మీ తన 150W టెక్నాలజీని ప్రదర్శించింది. ఇప్పుడు ఇదే టెక్నాలజీని రియల్మీ జీటీ నియో 3 ఫోన్లో అందిచనుంది. ఈ 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 5 నిమిషాల్లోనే 4,500mAh బ్యాటరీని 0 నుండి 50 వరకు ఛార్జ్ చేయవచ్చు.
కాగా, రియల్మీ జీటీ నియో 3 మొత్తం రెండు వేరియంట్లలో విడుదల కానుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ రెండు మోడల్‌లలో ఒక మోడల్ 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. అయితే, గ్లోబల్ వెర్షన్ మాత్రం 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను పొందే అవకాశం ఉంది.
రూ. 30 వేల ధరలో లభించే అవకాశం..
రియల్మీ జీటీ నియో 3 ఫోన్లో సరికొత్త మీడియాటెక్ డైమెన్సిటీ 8100 చిప్‌సెట్‌ను అందించే అవకాశం ఉంది. ఇటీవల నిర్వహించిన బెంచ్‌మార్క్ టెస్ట్‌లలో ఈ చిప్సెట్ మెరుగైన ఫలితాలను చూపింది. రియల్మీ జీటీ నియో 3 స్మార్ట్‌ఫోన్ ఫుల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ గల 6.5 -అంగుళాల AMOLED డిస్ప్లేతో రానుంది. ఈ మేరకు గత కొన్ని వారాల నుంచి ఆన్లైన్లో లీక్‌లు వస్తున్నాయి.
రియల్మీ జీటీ నియో 3లో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను అందించే అవకాశం ఉన్నందున, దీని ద్వారా క్లారిటీ ఫోటోలను తీయవచ్చు. ఇందులో ఓఐఎస్‌తో కూడిన 50 -మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ కెమెరా ఉంటుంది.
ఇది 8- మెగాపిక్సెల్ సెన్సార్, 2- మెగాపిక్సెల్ సెన్సార్ కెమెరాలతో వస్తుంది. గత కొన్నేళ్లుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతోంది. దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ప్రాధాన్యతనిస్తున్నాయి.
బడ్జెట్, మిడ్‌రేంజ్ ఫోన్లలోనే ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం, మార్కెట్లో కేవలం రూ. 30 వేల ధరలోపు 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గల స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. వచ్చే వారం మార్కెట్లోకి రానున్న రియల్మీ జిటి నియో 3 కూడా దాదాపు రూ. 30 వేల ధరలోనే లభించే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.