Home /News /technology /

REALME GT NEO 3 LAUNCH YOUR REAL GT NEO 3 TODAY DETAILS OF LEAKED FEATURES ONLINE BEFORE RELEASE GH VB

Realme GT Neo 3: నేడే రియల్​మీ జీటీ నియో 3 లాంచ్​.. రిలీజ్​కు ముందే ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రియల్​మీ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్​మీ జీటీ నియో 3 ఇవాళ (మార్చి 22)న అధికారికంగా చైనాలో విడుదల కానుంది. అయితే, దీని ప్రారంభానికి ఒక రోజు ముందే స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి.

రియల్​మీ లవర్స్​ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్​మీ జీటీ నియో 3 ఇవాళ (మార్చి 22)న అధికారికంగా చైనాలో విడుదల కానుంది. అయితే, దీని ప్రారంభానికి ఒక రోజు ముందే స్పెసిఫికేషన్లు ఆన్​లైన్​లో లీకయ్యాయి. ప్రముఖ టెక్​ వెబ్​సైట్​​ వీబో ప్రకారం, రియల్​మీ జీటీ నియో 3 మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5G ఎస్​ఓసీ ప్రాసెసర్​పై పనిచేస్తుంది. దీనిలో LPDDR5 ర్యామ్​, UFS 3.1 స్టోరేజ్​ను అందించింది. రియల్​మీ జీటీ నియో 3 సోనీ IMX766 మెయిన్​ సెన్సార్‌ కెమెరాను(Camara) కలిగి ఉంటుంది. దీనిలో 150W అల్ట్రాడార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించింది. విబోలో రియల్​మీ CMO Xu Qi Chase పోస్ట్ చేసిన ఫోటోలను పరిశీలిస్తే.. రియల్​మీ జీటీ నియో 3 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్​ప్లే HDR10+ మద్దతుతో పాటు 1,000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది.

ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100 5G SoC ప్రాసెసర్​పై పనిచేస్తుంది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. రియల్​మీ జీటీ నియో 3 ఎల్​ఈడీ ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది. దీనిలోని కెమెరా సెటప్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కు మద్దతిస్తుంది. ఇటీవల మార్కెట్​లోకి రిలీజైన వన్​ప్లస్​ 9RT, రియల్​మీ 9 ప్రోప్లస్​, ఒప్పో రెనో 5 ప్రో+ 5G వంటి ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లలోనూ ఇదే సెన్సార్​ను ఉపయోగించారు.

Rajya Sabhaకు AAP భల్లే ఎంపిక: హర్భజన్ సింగ్ ఇక ఎంపీ.. పెద్దలసభలో చిన్నోడు రాఘవ్ చద్దా.. పూర్తి జాబితా ఇదే


150W అల్ట్రాడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్​తో..

రియల్​మీ జీటీ నియో 3 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ అయినందున 4D గేమ్ వైబ్రేషన్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇది మొత్తం 39,606mm స్క్వేర్ హీట్ డిస్సిపేషన్ ఏరియా, 4,129mm స్క్వేర్ 3D టెంపర్డ్ వేపర్​ -ఛాంబర్ లేదా VC కూలింగ్ ఏరియాతో వస్తుంది. ఇటీవల MWC 2022 ఈవెంట్‌లో రియల్​మీ ప్రదర్శించిన 150W అల్ట్రాడార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మద్దతిస్తుంది. రియల్​మీ జీటీ నియో 3 కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 50 శాతం బ్యాటరీని నింపుతుందని పేర్కొంది.

ఈ ఫోన్ డాల్బీ అట్మోస్‌కు కూడా మద్దతునిస్తుంది. ఇది 8.22 మిమీ మందం, 188 గ్రాముల బరువు కలిగి ఉంటుంది. రియల్​మీ ఇటీవలే రియల్​మీ జీటీ నియో 3 లాంచింగ్​ డేట్​ను ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ చైనాలో మార్చి 22న స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు (భారత్​లో ఉదయం 11:30 IST) ప్రారంభం అవుతుంది. ఈ హ్యాండ్‌సెట్ లే మాన్స్ స్పీడ్‌వే నుండి ప్రేరణ పొందిన సరికొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇది రెండు వేర్వేరు బ్యాటరీ సామర్థ్యాలతో రెండు వేరియంట్‌లలో లభించే అవకాశం ఉంది. 4,500mAh బ్యాటరీ వేరియంట్ ​150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. మరోవైపు, 5,000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g technology, Realme, Realme gt

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు