REALME GT NEO 3 LAUNCH OF REAL ME GT NEO 3 SMARTPHONE FULL CHARGE SMARTPHONE IN 15 MINUTES DETAILS HERE GH VB
Realme New Smart Phone: 15 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ .. రియల్మీ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఆ వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
రియల్మీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ నియో 3 ఎట్టకేలకు చైనాలో లాంచ్ అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ దీన్ని క్లెయిమ్ చేసుకుంటుంది.
రియల్మీ(Realme) లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రియల్మీ జీటీ నియో 3 ఎట్టకేలకు చైనాలో లాంచ్(Launch) అయ్యింది. ప్రపంచంలోనే అత్యంత ఫాస్టెస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ దీన్ని క్లెయిమ్ చేసుకుంటుంది. ఈ ఫోన్లో 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను(Charging Support) అందించడం హైలెట్. ఈ టెక్నాలజీ(Technology) ద్వారా కేవలం 5 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీని ఛార్జ్ చేయవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి ఇటీవల 120 వాట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో షియోమి 11ఐ ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా ఇప్పడు రియల్మీ తన జీటి నియో 3ను విడుదల చేసింది. అయితే, ఈ ఫోన్ ప్రస్తుతానికి చైనా మార్కెట్లోనే అందుబాటులో ఉంటుంది. అతి త్వరలోనే భారత్‌లో సహా ఇతర దేశాల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
రియల్మీ జీటీ నియో 3 ధర, లభ్యత
రియల్మీ జీటీ నియో 3 (80W) బేస్ 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్CNY 1,999 (దాదాపు రూ. 24,000) వద్ద లభిస్తుంది. ఇక, 8GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,299 (దాదాపు రూ. 27,500), టాప్ 12GB ర్యామ్ + 256GB మోడల్ CNY 2,599 (సుమారు రూ. 31,200) వద్ద అందుబాటులో ఉంటాయి. మరోవైపు, రియల్మీ జీటీ నియో 3 (150W) 8GB ర్యామ్ + 256GB మోడల్ CNY 2,599 (దాదాపు రూ. 31,046) వద్ద లభిస్తుంది. ఇక, 12GB ర్యామ్ + 256GB మోడల్ CNY 2,799 (దాదాపు రూ. 33,600) వద్ద అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్సెట్లు సైక్లోనస్ బ్లాక్, సిల్వర్‌స్టోన్, లే మాన్స్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. చైనాలో రియల్మీ జీటీ నియో3 అన్ని వేరియంట్లు మార్చి 30 నుండి అమ్మకానికి వస్తాయి.
రియల్మీ జీటీ నియో 3 ఆండ్రాయిడ్11 ఓఎస్‌పై రన్ అవుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల 2K డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే HDR10+, DC డిమ్మింగ్ సపోర్ట్‌తో పాటు 1,000Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను అందిస్తుంది. రియల్మీ జీటీ నియో 3లో మీడియా టెక్ డైమెన్సిటీ 8100 5G SoC ప్రాసెసర్‌ను అందించింది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. రియల్మీ జీటీ నియో 3లో LED ఫ్లాష్‌తో పాటు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. కెమెరా సెటప్‌లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్(EIS)కు మద్దతు గల 50 -మెగాపిక్సెల్ సోనీ IMX766 ప్రైమరీ సెన్సార్ ఉంటుంది.
కనెక్టివిటీ ఆప్షన్లను పరిశీలిస్తే.. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్-సి పోర్ట్‌లు ఉంటాయి. ఈ హ్యాండ్సెట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు మద్దతిస్తుంది. రియల్మీ 150W అల్ట్రాడార్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,500mAh బ్యాటరీని, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించింది. MWC 2022 ఈవెంట్లో రియల్మీ ప్రదర్శించిన 150W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కేవలం 5 నిమిషాల ఛార్జ్‌తో 50 శాతం బ్యాటరీని నింపుతుందని పేర్కొంది. 80W సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ డివైజ్ 32 నిమిషాల్లోనే డివైజ్‌ను పూర్తిగా ఛార్జ్ చేస్తుందని పేర్కొంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.