Realme: రియల్​మీ నుంచి కొత్తగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లు లాంచ్​.. ధర, ఫీచర్ల వివరాలివే!

రియల్‌మీ జీటీ నియో 2టీ

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసింది. రియల్​మీ జిటి నియో 2 టి (Realme GT Neo 2T), రియల్‌మీ క్యూ 3 ఎస్ (Realme Q3s) పేరుతో చైనా మార్కెట్​లోకి వీటిని లాంచ్ చేసింది.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ రియల్‌మీ తాజాగా రెండు మిడ్​రేంజ్​ స్మార్ట్​ఫోన్లను లాంచ్​ చేసింది. రియల్​మీ జిటి నియో 2 టి (Realme GT Neo 2T), రియల్‌మీ క్యూ 3 ఎస్ (Realme Q3s) పేరుతో చైనా మార్కెట్​లోకి వీటిని లాంచ్ చేసింది.

అక్కడ వీటి ప్రీ-బుకింగ్స్​ను కూడా ప్రారంభించింది. నవంబర్ 1 నుంచి కొనుగోలుకు అందుబాటులోకి రానున్నాయి. అయితే భారత మార్కెట్​లో ఎప్పుడు లాంచ్​ అవుతాయనే విషయంపై స్పష్టత లేదు.

రియల్​మీ జీటీ నియో 2టీ, రియల్​మీ క్యూ 3 ఎస్​ ధర

కొత్త రియల్‌మీ జీటీ నియో 2టీ 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 1,899 (సుమారు రూ. 22,200), 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 2,099 (సుమారు రూ. 24,500) వద్ద లభిస్తాయి. 12 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 2,399 (సుమారు రూ. 28,100) వద్ద అందుబాటులో ఉంటుంది. రియల్​మీ క్యూ3 ఎస్​.. 6 జీబీ ర్యామ్​​ + 128జీబీ స్టోరేజ్​ వేరియంట్​ CNY 1,499 (సుమారు రూ. 17,500), 8 జీబీ ర్యామ్​ + 128 జీబీ స్టోరేజ్​ వేరియంట్​ CNY 1,599 (సుమారు రూ. 18,700), 8 జీబీ ర్యామ్​ + 256 జీబీ స్టోరేజ్​ ఆప్షన్​ CNY 1,999 (సుమారు రూ. 23,400) వద్ద అందుబాటులో ఉంటాయి. ఈ ఫోన్లు బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.

ఇది కూడా చదవండి: Nokia XR20: నీళ్లల్లో ముంచినా ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఏమీ కాదు... రేపటి నుంచి నోకియా ఎక్స్ఆర్20 ప్రీ-ఆర్డర్

రియల్‌మీ జిటి నియో 2 టి స్పెసిఫికేషన్లు

రియల్‌మీ జిటి నియో 2 టి ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0 పై రన్ అవుతుంది. 6.43 అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్​ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. కెమెరా విషయానికి వస్తే.. దీనిలోని ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 4 ఎంపీ మాక్రో లెన్స్‌ కెమెరాలను అందించింది. ఈ ఫోన్ 4WmAh బ్యాటరీతో కూడిన 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి: Samsung Galaxy Z Flip 3: శామ్‌సంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఎడిషన్ లాంచ్​.. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌‌ స్పెషాలిటీ ఏంటంటే...

రియల్​మీ క్యూ3 ఎస్​ స్పెసిఫికేషన్లు

రియల్‌మీ క్యూ 3 ఎస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యుఐ 2.0 పై రన్ అవుతుంది. 6.6- అంగుళాల ఫుల్-హెచ్‌డి ప్లస్​ డిస్‌ప్లేతో పనిచేస్తుంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G SoC ప్రాసెసర్​ ద్వారా పనిచేస్తుంది. రియల్‌మీ క్యూ 3 ఎస్‌లో పోర్ట్రెయిట్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను అందించింది. దీనిలో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 4 ఎంపీ మాక్రో సెన్సార్ కెమెరా వంటివి చేర్చింది. ఈ ఫోన్ 5000WAh బ్యాటరీతో కూడిన 30W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. దీనిలో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించింది. ఇది 5G కనెక్టివిటీకి మద్దతిస్తుంది.
Published by:Sambasiva Reddy
First published: