Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్​ఫోన్​ రిలీజ్... స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్​ఫోన్​ రిలీజ్... స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి

Realme GT Neo 2 | రియల్‌మీ ఫ్యాన్స్‌కు శుభవార్త. రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ లాంఛ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ తెలుసుకోండి.

  • Share this:
ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఇటీవల ప్రవేశపెట్టిన రియల్​మీ జీటీ సిరీస్​ను విస్తరిస్తోంది. గత నెలలో రియల్​మీ జీటీ (Realme GT), జీటీ మాస్టర్​ ఎడిషన్​ (Realme GT Master Edition) ఫోన్లను లాంచ్​ చేయగా వాటికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదే స్పీడ్​తో ఇప్పుడు రియల్​మీ జీటీ నియో 2 (Realme GT Neo 2) స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. ఈ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతానికి చైనాలో అందుబాటులోకి వచ్చింది. భారత్​లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. అయితే త్వరలోనే ఇది మన దేశంలో విడుదలయ్యే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.

iPhone 13 Offers: ఐఫోన్ 13 మోడల్స్‌పై రూ.46,000 వరకు తగ్గింపు... ఆఫర్ ఎలా పొందాలంటే

రియల్‌మీ జీటీ నియో 2 స్పెసిఫికేషన్లు


రియల్​మీ జీటీ నియో 2 ఫుల్-హెచ్‌డి+ రిజల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గల 6.62-అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. హెచ్​డీఆర్​10+ కంటెంట్, డీసీ డిమ్మింగ్, 600Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ సపోర్ట్​ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఎస్​ఓసీ ప్రాసెసర్​తో పనిచేస్తుంది. దీనిలో 12GB ర్యామ్​, 256GB స్టోరేజ్‌ను అందించింది. ఇక, కెమెరా విషయానికి వస్తే.. రియల్‌మీ జిటి నియో 2 లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌ను అందించింది. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ షూటర్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాలు ఉంటాయి.

Flipkart: రూ.20,000 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.14,099 ధరకే కొనొచ్చు ఇలా

5G, 4G LTE, వైఫై, బ్లూటూత్, యూఎస్​బీ టైప్-సి పోర్ట్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను వీటిలో సంస్థ అందించింది. రియల్‌మీ జిటి నియో 2లో గేమింగ్‌ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, కూలింగ్ సిస్టమ్‌ను కూడా చేర్చింది. ఇది ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ UI 2.0 పై నడుస్తుంది. గేమింగ్ కోసం GT మోడ్​ 2.0 ఆపరేటింగ్​ సిస్టమ్​ను అందించింది.

రియల్‌మీ జీటీ నియో 2 ధర, కలర్​ ఆప్షన్లు


చైనాలో రియల్‌మీ జీటీ నియో 2 బేస్ 8GB ర్యామ్​ + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 2,499 (సుమారు రూ. 28,500) వద్ద ప్రారంభమవుతుంది. 12GB RAM + 256GB స్టోరేజ్ గల టాప్ మోడల్ CNY 2,999 (సుమారు రూ. 34,200) వద్ద లభిస్తుంది. CNY 2,699 (సుమారు రూ. 30,800) ధరతో 8GB RAM + 128GB స్టోరేజ్​ను కూడా అందించింది. నియో గ్రీన్, పేల్​ బ్లూ, షాడో బ్లాక్ వంటి మూడు కలర్​ ఆప్షన్లలో ఇది అందుబాటులో ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published: