REALME GT NEO 2 DRAGON BALL Z LIMITED EDITION MAY LAUNCH IN INDIA SOON GH VB
Realme GT Neo 2: త్వరలోనే రియల్మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్ లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్ల వివరాలివే.. .
ప్రతీకాత్మక చిత్రం
కొత్త ఏడాదిలో పోటాపోటీగా స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తున్నాయి కంపెనీలు. మిగతా కంపెనీలతో పోలిస్తే రియల్మీ ముందు వరుసలో ఉంది. ఇదే స్పీడ్‌లో రియల్మీ ఓ సరికొత్త అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. త్వరలోనే రియల్మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్ లిమిటెడ్ ఎడిషన్‌ను భారత మార్కెట్లోకి ఆవిష్కరించనుంది.
కొత్త ఏడాదిలో పోటాపోటీగా స్మార్ట్ఫోన్లను(SmartPhones) విడుదల చేస్తున్నాయి కంపెనీలు. మిగతా కంపెనీలతో పోలిస్తే రియల్మీ(Raelme) ముందు వరుసలో ఉంది. ఇదే స్పీడ్‌లో రియల్మీ ఓ సరికొత్త అప్డేటెడ్ స్మార్ట్‌ఫోన్ మోడల్‌ను ఆవిష్కరించేందుకు సిద్దమవుతోంది. త్వరలోనే రియల్మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్ లిమిటెడ్ ఎడిషన్‌ను(Editions) భారత మార్కెట్లోకి ఆవిష్కరించనుంది. ఈ తాజా ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ను గత వారమే చైనా మార్కెట్లోకి తెచ్చింది. కంపెనీ తాజాగా విడుదల చేసిన ఫోటోలను(Photos) బట్టి చూస్తే.. ఇది మాట్టే ఫినిషింగ్‌లో ఆరెంజ్(Orange), బ్లూ పెయింట్(Blue Paint) జాబ్‌తో కూడిన గ్లాస్ బ్యాక్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్రేమ్ బ్లూ కలర్లో(Blue Color) లభిస్తుంది. డ్రాగన్ బాల్ ఎడిషన్‌లోని కలర్ స్కీమ్ మనకు అనిమే సిరీస్‌లోని గోకు అవుట్‌ఫిట్‌ను గుర్తు చేస్తుంది.
రియల్మీ సీఎంవో ఫ్రాన్సిస్ వాంగ్ ట్విట్టర్ వేదికగా ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ గురించి అనేక వివరాలను వెల్లడించారు. భారతదేశం, యూరప్ మార్కెట్లలో రియల్మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ జెడ్ లిమిటెడ్ ఎడిషన్ కొత్త కలర్ వేరియంట్లలో త్వరలోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
రియల్మీ జీటీ నియో 2 డ్రాగన్ బాల్ Z లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు..
రియల్మీ జీటీ నియో2 భారతదేశంలో సెప్టెంబర్‌లో లాంచ్ అయ్యింది. దాదాపు ఇవే ఫీచర్లతో కొత్త డ్రాగన్ బాల్ జెడ్ లిమిటెడ్ ఎడిషన్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.62- అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఈ డిస్ప్లే HDR10+ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 కోటింగ్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే పంచ్-హోల్ కటౌట్‌ను కలిగి ఉంది. ఇది అండర్ గ్లాస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌తో వస్తుంది. రియల్మీ జీటీ నియో2 క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ఆక్టాకోర్ ఎస్ఓసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 12 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. 64 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సిస్టమ్‌ను అందించింది. దీని ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను చేర్చింది. ఇది 5,000mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ 65W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. దీనిలో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, NFC, డాల్బీ అట్మోస్, హై-రెస్ ఆడియోతో కూడిన స్టీరియో స్పీకర్ సెటప్‌ను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్12 ఓఎస్‌పై పనిచేస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.