Realme GT Neo 2 vs iQOO 7: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Realme GT Neo 2 vs iQOO 7: ఈ రెండు 5జీ స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి

Realme GT Neo 2 vs iQOO 7 | ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌కు పోటీ ఇచ్చేందుకు రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ (Realme GT Neo 2) వచ్చేసింది. ఏ స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయి? మీరు కోరుకునే స్పెసిఫికేషన్స్ ఉన్నాయా? తెలుసుకోండి.

  • Share this:
    ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి రియల్‌మీ జీటీ నియో 2 (Realme GT Neo 2) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు అక్టోబర్ 16న, అందరికీ అక్టోబర్ 17న సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ చూసిన టెక్ నిపుణులు ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న ఐకూ 7 (iQOO 7) స్మార్ట్‌ఫోన్‌కు రియల్‌మీ జీటీ నియో 2 గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషించారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు దాదాపు ఒకే బడ్జెట్‌లో లభిస్తున్నాయి. రెండూ 5జీ స్మార్ట్‌ఫోన్సే (5G Smartphone). దీంతో ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల మధ్య ఉన్న తేడాలు, పోలికల గురించి స్మార్ట్‌ఫోన్ యూజర్లు సెర్చ్ చేస్తున్నారు. మరి రియల్‌మీ జీటీ నియో 2, ఐకూ 7 స్మార్ట్‌ఫోన్లలో ఏది బెస్ట్? తెలుసుకోండి.

    Price: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,999. లాంఛ్ ఆఫర్స్‌లో భాగంగా ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ పొందొచ్చు. ఆఫర్స్‌తో 8జీబీ+128జీబీ వేరియంట్ రూ.24,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్ రూ.28,999 ధరకు లభిస్తుంది. ఐకూ 7 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999. ఇక హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.33,999.

    Passwords: ఈ పాస్‌వర్డ్స్ పెట్టుకుంటే ఈజీగా హ్యాక్ చేయొచ్చు... తేల్చి చెప్పిన మొజిల్లా ఫౌండేషన్

    Dislplay: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సాంసంగ్ ఈ4 డిస్‌ప్లే ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది.

    RAM and Internal Storage: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజ్ అయింది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో ర్యామ్‌ను 7జీబీ వరకు పెంచుకోవచ్చు. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో లభిస్తుంది.

    Processor: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ సపోర్ట్ ఉంది. 8 5జీ బ్యాండ్ సపోర్ట్ లభిస్తుంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో ఒక 5జీ బ్యాండ్ సపోర్ట్ మాత్రమే ఉంది.

    WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... త్వరలో షాక్ ఇవ్వనున్న గూగుల్

    Rear Camera: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో 48మెగాపిక్సెల్ Sony IMX598 సెన్సార్ + 13 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.

    Front Camera: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

    Battery: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో 4,400ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 66వాట్ ఫ్లాష్‌ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది.

    Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

    Operating System: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 + ఆరిజిన్ ఓఎస్ సపోర్ట్ ఉంది.

    SIM Support: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్ డ్యూయెల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది.

    Colors: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌ను నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు. ఐకూ 7 స్మార్ట్‌ఫోన్ సాలిడ్ ఐస్ బ్లూ, స్టార్మ్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది.
    Published by:Santhosh Kumar S
    First published: