Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... రూ.7,000 డిస్కౌంట్

Realme GT Neo 2: రియల్‌మీ జీటీ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... తొలి సేల్‌లో రూ.7,000 డిస్కౌంట్ (image: Realme India)

Realme GT Neo 2 | రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంఛ్ అవుతుందన్న వార్తలు వచ్చినప్పటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ అంచనాలు పెరిగాయి. చివరకు భారీ స్పెసిఫికేషన్స్‌తో రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో రిలీజ్ అయింది.

  • Share this:
    రియల్‌మీ జీటీ సిరీస్‌లో ఇండియన్ మార్కెట్‌లో నియో స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. రియల్‌మీ జీటీ నియో 2 (Realme GT Neo 2) స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేసింది కంపెనీ. వాస్తవానికి రియల్‌మీ జీటీ నియో స్మార్ట్‌ఫోన్ కూడా ఉంది. ఈ మోడల్‌ను ఇండియాలో రియల్‌మీ ఎక్స్7 మ్యాక్స్ (Realme X7 Max) పేరుతో పరిచయం చేసింది కంపెనీ. ఇప్పుడు రెండో స్మార్ట్‌ఫోన్‌ను పేరు మార్చకుండా రియల్‌మీ జీటీ నియో 2 పేరుతోనే రిలీజ్ చేయడం విశేషం. ఇక ఇంతకు ముందే రియల్‌మీ జీటీ, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్లను కూడా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న సాంసంగ్ గెలాక్సీ ఎం52, ఎంఐ 11ఎక్స్ 5జీ, పోకో ఎఫ్3 జీటీ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది.

    రియల్‌మీ జీటీ నియో 2 ధర ఎంత?


    రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.31,999. ఇది 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. దీంతో పాటు 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. ధర రూ.35,999. లాంఛ్ ఆఫర్స్‌లో భాగంగా ఏకంగా రూ.7,000 డిస్కౌంట్ ప్రకటించింది రియల్‌మీ. అంటే రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.24,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.28,999 ధరకు సొంతం చేసుకోవచ్చు.

    WhatsApp: వాట్సప్ యూజర్లకు అలర్ట్... త్వరలో షాక్ ఇవ్వనున్న గూగుల్


    రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్ సేల్ అక్టోబర్ 17 అర్ధరాత్రి 12 గంటలకు మొదలవుతుంది. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, రీటైల్ స్టోర్లలో కొనొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఒక రోజు ముందుగానే ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. వారికి అక్టోబర్ 16 అర్ధరాత్రి 12 గంటలకే సేల్ ప్రారంభం అవుతుంది.

    Xiaomi 11 Lite 5G NE: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.8299 ధరకే కొనండి ఇలా

    రియల్‌మీ జీటీ నియో 2 స్పెసిఫికేషన్స్


    రియల్‌మీ జీటీ నియో 2 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 8జీబీ+128జీబీ, 12జీబీ+256జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో ర్యామ్‌ను 7జీబీ వరకు పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సాంసంగ్ ఈ4 డిస్‌ప్లే ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి. స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ సపోర్ట్, స్టైన్‌లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ ప్లస్ లాంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.

    రియల్‌మీ జీటీ నియో 2 కెమెరా ఫీచర్స్


    రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్ డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. నియో బ్లాక్, నియో బ్లూ, నియో గ్రీన్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published: