హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme GT 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్... రియల్‌మీ జీటీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Realme GT 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్... రియల్‌మీ జీటీ 5జీ ప్రత్యేకతలు ఇవే

Realme GT 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్... రియల్‌మీ జీటీ 5జీ ప్రత్యేకతలు ఇవే
(image: Realme)

Realme GT 5G: ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ అదుర్స్... రియల్‌మీ జీటీ 5జీ ప్రత్యేకతలు ఇవే (image: Realme)

Realme GT 5G | రియల్‌మీ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

  భారీ స్పెసిఫికేషన్స్‌తో గ్లోబల్ మార్కెట్‌లో మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ రిలీజ్ చేసింది. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ గురించి చాలాకాలంగా వార్తలు, లీక్స్ వస్తున్నాయి. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఆసక్తి పెరిగింది. వర్చువల్ ఈవెంట్‌లో ఈ రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 120Hz అమొలెడ్ డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలున్నాయి. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ+128జీబీ వేరియంట్ ధర 449 యూరోలు. అంటే సుమారు రూ.39,000. ఇక 12జీబీ+256జీబీ వేరియంట్ ధర 599 యూరోలు. అంటే సుమారు రూ.53,000. ప్రస్తుతానికి రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ కొన్ని దేశాల్లో మాత్రమే రిలీజ్ అయింది. పోలాండ్, రష్యా, స్పెయిన్, థాయ్‌ల్యాండ్ మార్కెట్లలో లభిస్తుంది.

  Jio 4G Data Plans: మొబైల్ డేటా ఎక్కువ కావాలా? జియో అందిస్తున్న12 డేటా ప్లాన్స్ ఇవే

  BSNL Plan: మూడు నెలలకు రూ.94 మాత్రమే... బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

  రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ Sony IMX682 ప్రైమరీ సెన్సార్ ఉండటం విశేషం. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 5జీ, 4జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది.

  OnePlus Nord CE 5G: రూ.22,999 ధరకే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్... కాసేపట్లో సేల్

  iQoo Z3 5G: రూ.19,990 విలువైన 5జీ స్మార్ట్‌ఫోన్‌ను రూ.5,490 ధరకే కొనండి ఇలా

  రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 0 నుంచి 100 శాతానికి 35 నిమిషాల్లో ఛార్జింగ్ చేయొచ్చని కంపెనీ చెబుతోంది. ఇక ఇందులో టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫోన్ బరువు 186 గ్రాములు. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ డ్యాషింగ్ బ్లూ, డ్యాషింగ్ సిల్వర్, రేసింగ్ ఎల్లో కలర్స్‌లో లభిస్తుంది.

  రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం ఇండియాలోని రియల్‌మీ ఫ్యాన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు