Home /News /technology /

REALME GT 5G AND REALME GT MASTER EDITION SMARTPHONES LAUNCHED IN INDIA KNOW PRICE AND SPECIFICATIONS SS

Realme GT 5G: రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి

Realme GT 5G: రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి
(image: Realme India)

Realme GT 5G: రియల్‌మీ జీటీ స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ధర, స్పెసిఫికేషన్లు తెలుసుకోండి (image: Realme India)

Realme GT 5G | రియల్‌మీ నుంచి మరో రెండు స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి. జీటీ సిరీస్‌లో రెండు మోడల్స్‌ని రియల్‌మీ పరిచయం చేసింది.

    రియల్‌మీ జీటీ 5జీ, రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మోడల్స్‌ని లాంఛ్ చేసింది రియల్‌మీ. ఇండియాలో జీటీ సిరీస్‌లో తొలిసారి రియల్‌మీ నుంచి వచ్చిన స్మార్ట్‌ఫోన్లు ఇవి. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ కావడం విశేషం. రియల్‌మీ జీటీ 5జీ రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది. 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.37,999 కాగా, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. ఇక రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.25,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.27,999. ఇక హైఎండ్ వేరియంట్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.29,999. ఆగస్ట్ 25 మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ జీటీ 5జీ సేల్ మొదలవుతుంది. ఆగస్ట్ 26న రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ సేల్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్లను రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో కొనొచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా లభిస్తుంది.

    Redmi Note 10S: రెడ్‌మీ నోట్ 10ఎస్ కొత్త కలర్ వచ్చేసింది... ఫీచర్స్ ఇవే

    Jio Cashback Offer: జియో యూజర్లకు రూ.100 వరకు క్యాష్‌బ్యాక్... ఆఫర్ పొందండి ఇలా


    రియల్‌మీ జీటీ 5జీ స్పెసిఫికేషన్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో అతి తక్కువ ధరలో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్ ఇదే. ఇందులో 7జీబీ ర్యామ్ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ జీటీ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ సోనీ వైడ్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. డ్యాషింగ్ బ్లూ, డ్యాషింగ్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. దీంతో పాటు వీగన్ లెదర్ బ్యాక్ వేరియంట్ కూడా ఉంది.

    Samsung Galaxy M21: ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.749 ధరకే కొనొచ్చు... పూర్తి వివరాలివే

    Dangerous Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 9 యాప్స్ డిలిట్ చేయండి


    ఇక రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ ఫీచర్స్ చూస్తే 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ 5జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్‌ప్యాన్షన్ ఫీచర్‌తో 5జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 11 + రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌లో 4,300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 65వాట్ సూపర్‌డార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉన్నాయి. 32మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. కెమెరాలో స్ట్రీట్ ఫోటోగ్రఫీ మోడ్ ఫీచర్ ఉంది. వొయెగర్ గ్రే, ల్యూన్ వైట్, కాస్మోస్ బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్‌కు రెండేళ్ల పాటు ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ అప్‌డేట్స్ లభిస్తాయి.

    ఈ రెండు స్మార్ట్‌ఫోన్లతో పాటు రియల్‌మీ నుంచి తొలి ల్యాప్‌టాప్ రియల్‌మీ బుక్ స్లిమ్ కూడా లాంఛ్ అయింది. బేసిక్ వేరియంట్ ధర రూ.44,999. ఇంటెల్ కోర్ ఐ3 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 256జీబీ ఎస్ఎస్‌డీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. హైఎండ్ వేరియంట్‌తో మరో మోడల్ కూడా ఉంది. ధర రూ.56,999. ఇందులో ఇంటెల్ కోర్ ఐ5 చిప్‌సెట్, 8జీబీ ర్యామ్, 512జీబీ ఎస్ఎస్‌డీ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. థండర్‌బోల్డ్ 4 పోర్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఉంది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. విండోస్ 10 హోమ్ ఎడిషన్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 2019 ప్రీలోడెడ్‌గా వస్తాయి. విండోస్ 11 అప్‌గ్రేడ్ ఉచితం.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు